అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి | cases should be registered | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి

Aug 11 2016 8:44 PM | Updated on Sep 15 2018 2:43 PM

మంబాపూర్‌లో దళితులను దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్న అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు డిమాండ్‌ చేశారు.

జిన్నారం: మంబాపూర్‌లో దళితులను దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్న అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు డిమాండ్‌ చేశారు. కేవీపీఎస్‌ నాయకులు గురువారం గ్రామంలో పర్యటించారు. కేవీపీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజుతో పాటు నాయకులు దళితులతో మాట్లాడి జరిగిన సంఘటనపై విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. దళితులపై దాడి జరిపి, వారిని గుడిలోకి రాకుండా అడ్డుకున్నవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ విషయమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement