breaking news
mambapur
-
అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి
జిన్నారం: మంబాపూర్లో దళితులను దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్న అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. కేవీపీఎస్ నాయకులు గురువారం గ్రామంలో పర్యటించారు. కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజుతో పాటు నాయకులు దళితులతో మాట్లాడి జరిగిన సంఘటనపై విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. దళితులపై దాడి జరిపి, వారిని గుడిలోకి రాకుండా అడ్డుకున్నవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ విషయమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. -
శిలాఫలకం చోరీ, మంత్రి పర్యటన రద్దు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి పర్యటన బుధవారం రద్దు అయ్యింది. వివరాల్లోకి వెళితే మంబాపూర్లో శంకుస్థాపన శిలాఫలకం చోరీ కావటంతో ఏకంగా మంత్రి కార్యక్రమం రద్దు అయినట్లు తెలుస్తోంది. పెద్దేముల్ మండలం మంబాపూర్లో పీహెచ్సీ భవన స్థల వివాదమే ఇందుకు కారణమని సమాచారం. ఈ ఘటనపై ఉప సర్పంచ్ ..పోలీసులకు ఫిర్యాదు చేశారు.