ముగ్గురు యువకులపై కేసు | case in three members | Sakshi
Sakshi News home page

ముగ్గురు యువకులపై కేసు

Sep 14 2016 8:13 PM | Updated on Sep 4 2017 1:29 PM

ఆత్మకూర్‌ (ఎస్‌) : మద్యం మత్తులో అంబేద్కర్‌ విగ్రహానికి వేసిన ముసుగు తొలగించి అవమానించిన ఘటనలో మండల పరిధిలోని పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆత్మకూర్‌ (ఎస్‌) :  మద్యం మత్తులో అంబేద్కర్‌ విగ్రహానికి వేసిన ముసుగు తొలగించి అవమానించిన ఘటనలో మండల పరిధిలోని పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ పి.పరమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆరెంపుల ప్రవీణ్, ఆరెంపుల నాగేందర్, ఆరెంపుల సైదులు సోమవారం రాత్రి మద్యం మత్తులో గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహం ముసుగు తొలగించి పసుపు, కుంకుమ చల్లారు. ఘటనపై గ్రామానికి చెందిన ఎ.సైదులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement