కట్నం కోసం వేధిస్తున్న ఐదుగురిపై కేసు | case file on five of dowry demand | Sakshi
Sakshi News home page

కట్నం కోసం వేధిస్తున్న ఐదుగురిపై కేసు

Published Thu, Jul 20 2017 11:06 PM | Last Updated on Fri, May 25 2018 12:56 PM

పెళ్ళై తొమ్మిదేళ్ళు కావస్తున్నా నేటికీ అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై భార్య ఫిర్యాదు చేసింది.

రాయదుర్గం అర్బన్‌: పెళ్ళై తొమ్మిదేళ్ళు కావస్తున్నా నేటికీ అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెక‌్షన్‌ 498– ఏ , వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకుని గురువారం దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఎస్‌  ఫర్జానాబేగం తెలిపిన వివరాల మేరకు... రాయదుర్గం పట్టణానికి చెందిన తనను 2009లో తన తల్లితండ్రులు బళ్లారిలోని సైపుల్లాకు ఇచ్చి వివాహం చేశారన్నారు.

తనకు పాప పుట్టిన తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువ అయ్యాయని చెప్పారు. పెద్దలు నచ్చజెప్పినప్పటికీ సైపుల్లాలో మార్పు రాలేదని తెలిపారు. దీంతో సైపుల్లాతో పాటు వారి కుటుంబ సభ్యులు నలుగురిపైన కోర్టు ద్వారా ఫర్జానాబేగం కేసు వేసింది. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహానంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement