కాల్వలోకి దూసుకుపోయిన కారు | car accident at tallapalem | Sakshi
Sakshi News home page

కాల్వలోకి దూసుకుపోయిన కారు

Jul 30 2017 12:00 PM | Updated on Aug 14 2018 3:22 PM

కాల్వలోకి దూసుకుపోయిన కారు - Sakshi

కాల్వలోకి దూసుకుపోయిన కారు

అదుపుతప్పి కారు కాల్వలోకి దూసుకుపోవడంతో ఇద్దరు మృతిచెందారు.

ఏలూరు: అదుపుతప్పి కారు కాల్వలోకి దూసుకుపోవడంతో ఇద్దరు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామం వద్ద ఆదివారం ఉదయం ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాల్వలోకి దూసుకుపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు.

మృతులు విజయవాడకు చెందిన కంబాల సాయిరాం, గోపీచంద్‌గా గుర్తించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనస‍్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement