సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేయాలి | Cancel CPS | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేయాలి

Aug 7 2016 9:13 PM | Updated on Sep 4 2017 8:17 AM

మాట్లాడుతున్న కష్ణుడు

మాట్లాడుతున్న కష్ణుడు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కష్ణుడు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

– బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కష్ణుడు
మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కష్ణుడు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్‌సీ బకాయిలను చెల్లించాలని, బీసీ ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రమోషన్లకు కావాల్సిన చదువుకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని అన్నారు. క్రిమిలేయర్‌ విధానాన్ని తొలగించేందుకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్‌.కష్ణయ్యతో అసెంబ్లీలో చర్చించి రద్దు చేసేందుకు రాష్ట్ర శాఖ కషి చేస్తుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్, గురుప్రసాద్, సదాశివుడు, సత్యం, రవి, రాజు, రాఘవేందర్, శివకుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement