కర్నూలులో పిస్టల్ కలకలం | businessman afraid due to pistol warning by issaq | Sakshi
Sakshi News home page

కర్నూలులో పిస్టల్ కలకలం

Aug 7 2015 2:46 PM | Updated on Oct 4 2018 8:31 PM

కర్నూలులో పిస్టల్ కలకలం - Sakshi

కర్నూలులో పిస్టల్ కలకలం

పిస్టల్‌ చూపించి ఓ వ్యక్తిని బెదిరించిన సంఘటన కర్నూలు జిల్లా కల్లూరు వద్ద చోటుచేసుకుంది.

కర్నూలు :  పిస్టల్‌ చూపించి ఓ వ్యక్తిని బెదిరించిన సంఘటన కర్నూలు జిల్లా కల్లూరు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. కర్నూలుకు చెందిన ఇసాక్ అనే బంగారు వ్యాపారి, ఓ కొనుగోలు దారుడితో వ్యాపార లావాదేవీల్లో తేడా రావడంతో పిస్టల్‌తో బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పిస్టల్‌కు లెసైన్స్ లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇతనికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇసాక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement