యర్కారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి | bus fecility provided to yarkaram | Sakshi
Sakshi News home page

యర్కారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి

Aug 23 2016 8:53 PM | Updated on Sep 4 2017 10:33 AM

యర్కారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి

యర్కారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి

సూర్యాపేటరూరల్‌ : యర్కారం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

సూర్యాపేటరూరల్‌ : యర్కారం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సూర్యాపేట–జనగాం రోడ్డుపై యర్కారం స్టేజీ వద్ద యర్కారం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతూ రెండు గంటల పాటు టీవీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు విద్యాబ్యాసానికి దూరమవ్వాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సూర్యాపేటరూరల్‌ ఎస్‌ఐ జి.శ్రీనువాస్‌రెడ్డి హామీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మోదాల భిక్షపతి, మెడిగ శ్రీకాంత్, ఆవుదొడ్డి పరమేష్, కుమ్మరికుంట్ల సాయిబాబా, మర్యాద ప్రవీణ్, శ్రీను, సైదులు, గౌతమి, భవాని, సంధ్య, వాణి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement