breaking news
yarkaram
-
బీఆర్ఎస్ నేత హత్య కేసును చేధించిన పోలీసులు
సూర్యాపేట: బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. పాతకక్షల నేపథ్యంలోనే మధును మట్టుబెట్టారని చెప్పారు. తన తండ్రి హత్యకు ప్రతీకారంగా ప్రధాన నిందితుడు మిద్దె జీవన్ ఈ హత్యకు పాల్పడినట్టు ఎస్పీ వెల్లడించారు. అతడికి మరో ఐదుగురు సహకరించారని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిద్దె రవీందర్ 2007లో యర్కారంలో హత్యకు గురయ్యాడు. తన తండ్రిని హత్య చేసిన మధుపై ప్రతీకారం తీర్చుకునేందుకు రవీందర్ కొడుకు జీవన్ గతంలో రెండు సార్లు హత్యాయత్నం చేసి విఫలం అయ్యాడు. తాజాగా పక్కా ప్లాన్‌తో మధును హత్య చేశాడు. కొంతకాలంగా సూర్యాపేట బాలాజీనగర్‌లో కుటుంబంతో పాటు నివసిస్తున్న మధును పథకం ప్రకారం బయటకు తీసుకొచ్చి కత్తులతో నరికి చంపారు.చేపల కూరతో పార్టీ చేసుకుందామంటూ మధును చింత సైదులు శుక్రవారం తన ఇంటికి పిలిచాడు. వీరితో పాటు మేదరి ప్రసాద్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. సాయంత్రం సైదులు, ప్రసాద్‌తో కలిసి మధు మద్యం సేవించాడు. అతడు మత్తులోకి జారుకోగానే జీవన్‌కు సైదులు ఫోన్ చేశాడు. సోదరుడి వరుస అయ్యే ఆనంద్‌తో కలిసి మటన్ కొట్టే కత్తి తీసుకుని సైదులు ఇంటికి వచ్చాడు జీవన్. ఆ తర్వాత జీవన్, సైదులు కత్తితో మధును విచక్షణారహితంగా నరికి చంపారు. మృతదేహాన్ని గొనెసంచితో మూటగట్టి, కారులో తీసుకెళ్లి యర్కారం వద్ద కల్వర్ట్‌లో పడేశారు.మధు హత్యకు సహకరించిన సైదులు భార్య ముల్కలపల్లి భవానీ పరారీలో ఉందని ఎస్పీ నరసింహ తెలిపారు. మిద్దె జీవన్, చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరేణి భరత్ చంద్‌లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితులతో పాటు కారు, బైక్, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ అన్నారు. చదవండి: వ్యవస్థ చచ్చింది.. శవమై నడిచింది! -
బీఆర్ఎస్ నేత దారుణ హత్య.. అర్థరాత్రి హైటెన్షన్
సాక్షి, సూర్యాపేట: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సూర్యాపేట మండలం యర్కారంలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. మూడు ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో పడేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. రాజకీయ హత్యలకు యర్కారం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొన్నేళ్ల క్రితం అప్పటి సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యర్కారంలో హత్యకు గురైన మధు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు . ఆయన భార్య మౌనిక యర్కారం మాజీ సర్పంచ్. మధును హత్య చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లేనని మౌనిక ఆరోపిస్తున్నారు. తన భర్తను మిద్దె రవీందర్ కుమారుడితో పాటు మరో 15 మంది కలిసి హత్య చేసినట్టు చెబుతున్నారు.ఇదిగా ఉండగా.. సూర్యాపేట ప్రాంతంలో ఫ్యాక్షన్ గ్రామంగా యర్కారానికి పేరు. గ్రామంలో 1985 నుంచి ఇప్పటి వరకు హత్యకు గురైన వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది నాయకులు ఉన్నారు. తాజాగా హత్యకు గురైన చింతలపాటి మధు గతంలో జరిగిన ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు. 2004లో జరిగిన మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు. నిన్న రాత్రి 11-12 గంటల ప్రాంతంలో మధు హత్య జరిగింది. అత్యంత దారుణంగా కత్తులు, గొడ్డళ్లు, వేట కొడవళ్లతో దుండగులు నరికి చంపారు. ముఖం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. హత్య అనంతరం గోనె సంచుల్లో కుక్కి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. -
యర్కారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి
సూర్యాపేటరూరల్ : యర్కారం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్‌యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట–జనగాం రోడ్డుపై యర్కారం స్టేజీ వద్ద యర్కారం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతూ రెండు గంటల పాటు టీవీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు విద్యాబ్యాసానికి దూరమవ్వాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సూర్యాపేటరూరల్ ఎస్ఐ జి.శ్రీనువాస్‌రెడ్డి హామీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మోదాల భిక్షపతి, మెడిగ శ్రీకాంత్, ఆవుదొడ్డి పరమేష్, కుమ్మరికుంట్ల సాయిబాబా, మర్యాద ప్రవీణ్, శ్రీను, సైదులు, గౌతమి, భవాని, సంధ్య, వాణి, తదితరులు పాల్గొన్నారు.


