ఘాట్ల వరకూ బస్సులు | Bus facility for puskara ghats | Sakshi
Sakshi News home page

ఘాట్ల వరకూ బస్సులు

Aug 13 2016 9:49 PM | Updated on Sep 4 2017 9:08 AM

బస్సులో ప్రయాణిస్తున్న ఐజీ

బస్సులో ప్రయాణిస్తున్న ఐజీ

కృష్ణా పుష్కరాలకు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం బస్సు సర్వీసులను ఘాట్ల వరకు నడుపుతామని గుంటూరు ఐజీ సంజయ్‌ తెలిపారు.

ఐజీ సంజయ్‌ వెల్లడి
 
సీతానగరం (తాడేపల్లి రూరల్‌) : కృష్ణా పుష్కరాలకు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం బస్సు సర్వీసులను ఘాట్ల వరకు నడుపుతామని గుంటూరు ఐజీ సంజయ్‌ తెలిపారు. సీతానగరం పుష్కర ఘాట్‌ వద్దకు శనివారం వచ్చిన ఆయన వాహనాల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్‌కు అసౌకర్యం లేకుండా గుంటూరు నుంచి విజయవాడ వచ్చే బస్సులను నేరుగా సీతానగరం పుష్కర ఘాట్‌కు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గుంటూరు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వచ్చిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులు అక్కడ నుంచి దుర్గ ఘాట్‌ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉండవల్లి సెంటర్‌ నుంచి దుర్గ ఘాట్‌ వరకు, అలాగే సీతానగరం ఘాట్‌ వరకు ఐజీ బస్సులో ప్రయాణించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement