తిరుమల ఘాట్‌రోడ్డులో బస్సును ఢీకొన్న కారు | bus-car collilson in tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్‌రోడ్డులో బస్సును ఢీకొన్న కారు

Nov 3 2016 9:39 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

తిరుమల: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుమల రెండో కనుమ రహదారిలోని 12వ మలుపు వద్ద గురువారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

దీంతో కారులో ఉన్న ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement