ఎన్‌హెచ్‌పై ప్రైవేట్‌ బస్సు బోల్తా | BUS ACCIDENT | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌పై ప్రైవేట్‌ బస్సు బోల్తా

Aug 21 2016 11:09 PM | Updated on Sep 4 2017 10:16 AM

బోల్తాపడిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

బోల్తాపడిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

మహబూబ్‌నగర్‌ క్రైం : అనుకున్న సమయానికి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాలన్న ఆత్రుతలో డ్రైవర్‌ అతివేగంగా నడపటం వల్ల ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.

– 8మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు
– దివిటిపల్లి, షేర్‌పల్లి మధ్య ఘటన
మహబూబ్‌నగర్‌ క్రైం : అనుకున్న సమయానికి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాలన్న ఆత్రుతలో డ్రైవర్‌ అతివేగంగా నడపటం వల్ల ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్‌ నుంచి హైదరాబాద్‌కు 32మంది ప్రయాణికులతో ఓ ప్రైౖవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బయలుదేరింది.
 
        ఆదివారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్‌ మండలంలోని దివిటిపల్లి, షేర్‌పల్లి మధ్య జాతీయ రహదారిపై అదుపుతప్పి పక్కన ఉన్న పంట పొలాల్లో దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో మిగతావారు గమనించి వెంటనే క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని రూరల్‌‡ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్‌ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement