రెండు పళ్ల విభాగంలో సత్తాచాటిన కృష్ణాజిల్లా ఎడ్లు | bulls teeth competitions | Sakshi
Sakshi News home page

రెండు పళ్ల విభాగంలో సత్తాచాటిన కృష్ణాజిల్లా ఎడ్లు

Oct 12 2016 8:59 PM | Updated on Sep 4 2017 5:00 PM

రెండు పళ్ల విభాగంలో సత్తాచాటిన కృష్ణాజిల్లా ఎడ్లు

రెండు పళ్ల విభాగంలో సత్తాచాటిన కృష్ణాజిల్లా ఎడ్లు

మండలంలోని కేసరపల్లిలో తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.

కేసరపల్లి (గన్నవరం) : మండలంలోని కేసరపల్లిలో తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. తొలుత ఈ పోటీలను ఒంగోలు జాతి పశు సంరక్షణ సంఘ నాయకులు వింత సాంబిరెడ్డి, మల్లంపాటి బాబూరావు, మాజీ ఎంపీపీ పొట్లూరి బసవరావు ప్రారంభించారు. అనంతరం రెండు పళ్ల విభాగంలో పోటాపోటీగా జరిగిన బలప్రదర్శనలో కృష్ణాజిల్లా ఎడ్లు ప్రథమ స్థానం సాధించాయి. ఈ విభాగంలో మొత్తం పది ఎడ్లజతలు పాల్గొనగా, విజయవాడకు చెందిన మేకా కృష్ణమోహన్‌ ఎడ్లజత నిర్ణీత వ్యవధిలో బండను 3,346 అడుగుల దూరంలాగి విజేతగా నిలిచింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన చంటి గణేష్‌రెడ్డి ఎడ్లజత 3,642 అడుగులు లాగి ద్వితీయ స్థానం సాధించింది. గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం ఉప్పలపాడుకు చెందిన మంచిగంటి శివనాగలలిత సుభాష్‌ ఎడ్లజత 3,323 అడుగులు, కృష్ణాజిల్లా పెదపులిపాకకు చెందిన గరికపాటి శ్రీధర్, గుంటూరు జిల్లా నడుంపల్లికి చెందిన కొడాలి మోహన్‌స్నిగ్ధ కంబైన్డ్‌ ఎడ్లజత 3,300 అడుగులు, పెదకాకాని మండలం కొప్పిరావూరుకు చెందిన అప్పికట్ల వెంకటేశ్వర్లు ఎడ్లజత 2,281 అడుగుల దూరం బండను లాగి వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి. అనంతరం గెలుపొందిన ఎడ్లజతల యాజమానులకు నగదు బహుమతులు అందజేశారు. తొలిరోజు ఎడ్ల బలప్రదర్శనను వీక్షించేందుకు రైతు సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పోటీలకు రిఫరీగా సూరపనేని రాధాకృష్ణప్రసాద్‌ వ్యవహరించగా, పెదకడిమి పీఏసీఎస్‌ అధ్యక్షుడు చలగుళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఆరుపళ్ల విభాగంలో పోటీలు కొనసాగుతాయి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement