ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేవారికి బుద్ధి చెబుతామని జాతీయ ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి వెంకటస్వామి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోగల ఆర్‌అండ్‌బీ
అడ్డుకునేవారికి బుద్ధి చెబుతాం
Sep 16 2016 11:36 PM | Updated on Sep 4 2017 1:45 PM
వినాయక్‌నగర్ :
ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేవారికి బుద్ధి చెబుతామని జాతీయ ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి వెంకటస్వామి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోగల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో ఎస్సీవర్గీకరణను కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయన్నారు. ఎస్సీవర్గీకరణ ఆగదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాల అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం వచ్చేనెల 20న హైదరాబాద్‌లో ధర్మ యుద్ధం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వచ్చేనెల 3న సన్నాహక సదస్సు నిర్వహిస్తామన్నారు. సదస్సులో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణం మాదిగ, రాష్ట్ర నాయకులు గంగాధర్, పోశెట్టి, యమున, తార, శ్రీనివాస్, తోబేవార్ సంతోష్, విఠల్, తిమప్ప, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement


