Classification
-
‘ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం’
సాక్షి, తాడేపల్లి: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్న ఆదిమూలపు.. ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలియదా? ఒక బిల్లును పకడ్బందీగా తయారు చేయాలి. దానిని సంబంధిత మంత్రి చేత సభలో ప్రవేశపెట్టాలి. దానిపైన సమగ్ర చర్చ జరగాలి. దానిలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆమోదించి, తరువాత దానిని గవర్నర్‌కు పంపుతారు. దానిని గవర్నర్ ఆమోదిస్తారా లేక కేంద్రానికి పంపుతారా అనేది ఉంటుంది. ఇది ఒక చట్టం విషయంలో ఏ ప్రభుత్వం అయినా పాటించాల్సిన విధానం ఇది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎక్కడా అనుసరించినట్లు కనిపించడం లేదు’’ అంటూ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు...గవర్నర్ ద్వారా తీసుకువచ్చే ఆర్డినెన్స్‌కు కేవలం కొన్ని నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. శాసనసభ సమావేశాలు లేని సమయంలో చట్టం చేయడం కుదరదు కాబట్టి ఆర్డినెన్స్‌ను తీసుకువస్తారు. బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతున్నా ఎందుకు ఈ సమావేశాలను వినియోగించుకోలేక పోయారు? అంటే దీని అర్థం ఇంకా రాజకీయం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం బయటపడినట్లే కదా?. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశాన్ని ఆఖరిరోజు లఘు చర్చకు పెట్టడంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో చిత్తశుద్ది లోపించినట్లు, స్పష్టత లేకుండా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏరకంగా దళితులకు న్యాయం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది...ప్రభుత్వం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను మార్చి 10న కేబినెట్లో పెట్టారు. ఈ రిపోర్ట్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అలా పెట్టి ఉంటే అందరూ దీనిపై చర్చించేవారు. ఏదైనా సందేహాలు ఉంటే దానిపై అందరూ కలిసి ఒక స్పష్టత వచ్చేలా చూసేవారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన చెబుతున్నది ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. రోస్టర్ విధానం మీద చంద్రబాబు చేసిన ప్రకటనలు పూర్తి అయోమయానికి దారి తీసేలా ఉన్నాయి. ఉద్యోగసంఘాలు కూడా ఇలాంటి రోస్టర్ విధానాన్ని ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు...రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటమని చెబుతున్నారు. అలాగే 2026 జనాభా లెక్కలు జరిగిన తరువాత మళ్ళీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అంటే సమస్యను మళ్ళీ మొదటికి తీసుకువస్తున్నారనే అనుమానాలు కలిగిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయడంకుండా దానిపైన మంటలు రేపడం, దానిపైన తన్నుకుంటూ ఉంటే రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం కనిపిస్తోంది. తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. చట్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని పకడ్బందీగా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇలా ఎందుకు చేయలేదు?...ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వ సరైన పరిష్కారం చూపుతుందా? లేదా? లేక సమస్యను ఇలాగే ఉంచి వివాదాన్ని రాజకీయంగా రగిల్చి, ఎప్పటికీ ఆరని మంటలా చేసి, దానిలో చలి కాచుకోవాలని అనుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్గీకరణ సమస్యను డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాలకు రావాల్సిన ఫలాలను రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం రాష్ట్రప్రజలు అనుమానిస్తున్నట్లుగా రాజకీయంగా దీనిని వాడుకునేట్లుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో మా చదువులు ముందుకు సాగనివ్వకుండా, మా ఆరోగ్యాలకు భద్రత లేకుండా, ఏదైనా భూమిని సాగుచేసుకుంటే కౌలురైతులుగా ఉన్న మా రైతులకు ఎలాంటి సహాయం లేకుండా ఇలా అన్ని రకాలుగా మాకు తీరని ద్రోహం చేస్తున్నారు...ఒకపక్క వర్గీకరణ సమస్యను అలాగే ఉంచి, మరోవైపు దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే అన్ని పథకాలను అందకుండా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, పాఠశాలల్లో నాడు-నేడు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన లేదు, చేయూత లేదు, రైతుభరోసా లేదు ఇలా గతంలో వైయస్ జగన్ గారు మా వర్గాలకు భరోసా కల్పించేందుకు అమలు చేసిన వెన్నుముక లాంటి పథకాలు, కార్యక్రమాలు లేనే లేవు. వర్గీకరణను అయోమయంలో నెట్టారు. 2026 జనాభా ప్రకారం జిల్లాను ఒక యూనిట్ అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఒక యూనిట్ అంటున్నారు. రాష్ట్రం ఒక యూనిట్ అంటే నష్టపోతాం. కోస్తా ప్రాంతంలో మాల సామాజికవర్గం, రాయలసీమ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది. న్యాయం జరగదు. జిల్లాను ఒక యూనిట్ గా చూడాలంటే 2026 జనాభా లెక్కలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ అయోమయం ఎందుకు? ..ముందుగానే కూటమి ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు ఉన్నాయి. మనసా వాచా కర్మేణ అందరికీ న్యాయం జరగాలి. దళితుల్లో ఉపకులాలను విడగొట్టకుండా, దళితుల్లో ఐక్యతను పెంచడానికి, వారిని బలోపేతం చేయడానికి వైయస్ జగన్ గారి ప్రభుత్వం కృషి చేసిందో, సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ను ముందుకు తీసుకుపోవాలని మేం స్పష్టంగా ఆనాడే చెప్పాం. దానికీ ఈరోజుకూ కట్టుబడి ఉన్నాం. కానీ దీనికి విరుద్దంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది. ఈ అంశంపై ఎల్లో మీడియా సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుడు రాతలు రాస్తోంది. ఈ అంశాన్ని అవకాశవాద, స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకోకుండా, దీనిని పరిష్కారం లేని సమస్యగా మారుస్తే ప్రజలు తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు.’’ అని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. -
ఎస్సీ వర్గీకరణ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, సాక్షి: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్‌మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక.. 24గంటల్లో కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని, కమిషన్ రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు సూచనలు చేశారు. -
కోటాలో సబ్ కోటా తప్పు కాదు..
-
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
‘‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు అంతర్గత వివక్ష కారణంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కూడా ఒక వర్గంలో ఉప వర్గాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తోంది. ఈ క్రమంలో 2004 నాటి ఈవీ చిన్నయ్య కేసులోని తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అయితే ఉప వర్గీకరణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక సబ్ క్లాస్‌కు మొత్తం రిజర్వేషన్‌ను కేటాయించ కూడదు. అంతేగాకుండా ఏయే ఉప వర్గాలు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేక పోతున్నాయన్న డేటా ఆధారంగా వర్గీకరణ జరగాలి’’ – సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో విద్య, ఉద్యోగాలలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సబ్క్లాస్లుగా వర్గీకరించి.. ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మార్గం సుగమం కానుంది. 25 ఏళ్లుగా నానుతున్న వర్గీకరణ!దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఆయా వర్గాల్లోని కొన్ని కులాల వారే పొందుతున్నారని.. అందువల్ల ఈ రిజర్వేషన్లను వర్గీకరించాలని చాలా కాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 2000వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో చేసిన రిజర్వేషన్ల చట్టం, దానిని కొట్టివేస్తూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని ఈ తీర్పు ఆధారంగా పంజాబ్–హరియాణా హైకోర్టు కొట్టివేయడం తదితర పరిణామాలతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.తొలుత దీనిపై (పంజాబ్ వర్సెస్ దేవీందర్‌సింగ్ కేసు) విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం.. పూర్తిస్థాయిలో పునర్విచారణ నిమిత్తం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ధర్మాసనం ‘‘రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయడం 14, 15, 16 ఆర్టికల్‌లకు భంగం కలిగిస్తుందా? షెడ్యూల్డ్ కులాలు/తెగలు సజాతీయమేనా (ఒకేవర్గం కింద పరిగణించవచ్చా?) లేక భిన్నమైన వర్గాల సమూహమా? ఆర్టికల్ 341కు ఇవి భిన్నమా? ఉప వర్గీకరణ పరిధిలో ఏమైనా పరిమితులు ఉన్నాయా?’’ అన్న అంశాలను లోతుగా పరిశీలించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని వర్గాల వాదనలు విని.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది.నెహ్రూ వ్యాఖ్యలను కోట్ చేస్తూ..‘‘మతపరంగా, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగితే భారతదేశం రెండో లేదా మూడో గ్రేడ్ దేశంగా మారుతుంది. ఈ మార్గం మూర్ఖత్వం మాత్రమే కాదు. విపత్తు కూడా. కానీ వెనుకబడిన వర్గాలకు అన్ని విధాలుగా సహాయం చేయాల్సి ఉంది..’’ అన్న మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలను ధర్మాసనం తమ తీర్పులో ఉటంకించింది.మన తొలితరాల వారు, న్యాయమూర్తులతోపాటు మాజీ ప్రధాని కూడా.. ఏ వర్గం లేదా కులానికి చెందినవారికి పూర్తిగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని వ్యతిరేకించారని.. మెరిట్ ప్రాతిపదికన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారని పేర్కొంది. ఈ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల్లో కొంతమంది ముందుకుసాగడంలో ఇబ్బంది పడుతున్నారని.. వారికి చేయూతనివ్వడం ఎంతో అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు ధర్మాసనం అనుమతిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు 565 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు అనుగుణంగా రాష్ట్రా లు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచించింది.ఆరుగురు అనుకూలం.. ఒకరు వ్యతిరేకంఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఉన్నారు. వీరిలో జస్టిస్ బేలా త్రివేదీ వర్గీకరణను విభేదించగా.. మిగతా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా కలిపి ఒకే తీర్పు ఇవ్వగా, మిగతా జడ్జీలు వేర్వేరుగా తమ తీర్పులు ఇచ్చారు. దీనితో మొత్తం ఆరు తీర్పులు వెలువడ్డాయి. మెజారిటీ న్యాయమూర్తులు అనుకూలంగా ఉండటంతో.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు అయింది.కేంద్ర ఉద్యోగాలు, విద్యాసంస్థలకు ‘వర్గీకరణ’ వర్తించనట్లే!సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థలు, ఉద్యోగాలు, పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందని న్యాయ నిపుణులు, ఎమ్మార్పీస్ నేతలు చెప్తున్నారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల్లోని ఉద్యోగాలు, విద్యా సంస్థలపై ప్రభావం చూపదని అంటున్నారు. రాష్ట్రాలు చేసిన చట్టాలపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. కోర్టు కూడా రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చనే దానిపైనే తాజా తీర్పు ఇచ్చిందని వివరిస్తున్నారు.ఇందులో జాతీయ స్థాయిలో, కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశమేదీ లేదని స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్రాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, కులాలు, తెగలు విభిన్నంగా ఉంటాయని.. వాటిని కేంద్ర స్థాయిలో వర్గీకరించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఎస్సీల్లోని మాదిగ వర్గం కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణ గురించి ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్ చేయలేదని, దేశవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీస్ అధ్యక్షుడు నరేశ్ చెప్పారు. కేంద్ర ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వర్గీకరణపై ఇప్పటివరకు తాము దృష్టి పెట్టలేదన్నారు.వెనుకబాటు ఆధారంగా ఉప వర్గీకరణ‘‘షెడ్యూల్డ్ కులాలు సజాతీయ తరగతి (ఒకే వర్గానికి చెందిన సమూహం) కాదని సూచించే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద పొందుపరిచిన సమానత్వ సూత్రాన్ని గానీ.. ఆర్టికల్ 341(2)ను గానీ ఉల్లంఘించదు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లలో కూడా రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయకుండా రాష్ట్రాలను నిరోధించేది ఏమీ లేదు.ఉప వర్గీకరణ అయినా, మరేదైనా నిశ్చయాత్మక చర్య అయినా.. వాటి లక్ష్యం వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు కల్పించడమే. కొన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప వర్గీకరణ చేయవచ్చు. అయితే ఏదైనా కులం/ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడానికి దాని వెనుకబాటుతనమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకోవాలి. ఆ కులం/ ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడంపై డేటాను సేకరించాలి. అందుకు అనుగుణంగా ఉప వర్గీకరణ చేయాలి..’’ – జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రారిజర్వేషన్లు ఒక తరానికే పరిమితం చేయాలిఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను సమర్థిస్తున్నాను. అయితే ఏ రిజర్వేషన్లు అయినా మొదటి తరానికి లేదా ఒక తరానికి మాత్రమే వర్తింపజేయాలి. కుటుంబంలోని ఏదైనా తరం రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితిని సాధిస్తే.. రిజర్వేషన్ల ప్రయోజనం లాజికల్‌గా రెండో తరానికి అందుబాటులో ఉండరాదు. రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని సాధారణ వర్గంతో కలసిన కుటుంబాలను.. తర్వాత రిజర్వేషన్లు పొందకుండా మినహాయించడానికి కాలానుగుణ కసరత్తు చేపట్టాలి. – జస్టిస్ పంకజ్ మిత్తల్క్రీమీలేయర్ వర్తింపజేయాలివెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రాల విధి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలను తిరస్కరించలేం. శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న కులాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్నాయి. అయితే ఉప వర్గీకరణ సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని క్రీమీలేయర్ (అధికాదాయం ఉన్నవారిని) గుర్తించాలి. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గం.ఇందుకోసం రాష్ట్రాలు ఒక విధానాన్ని రూపొందించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల క్రీమీలేయర్ మినహాయింపు ప్రమాణాలు ఇతర వెనుకబడిన కేటగిరీలకు వర్తించే ప్రమాణాలకు భిన్నంగా ఉండవచ్చు. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో ప్రాథమిక లోపం ఏమిటంటే.. ఆర్టికల్ 341 రిజర్వేషన్లకు ప్రాతిపదిక అని అర్థం చేసుకొని ముందుకు వెళ్లడమే! ఆర్టికల్ 341 అనేది రిజర్వేషన్ల ప్రయోజనాల నిమిత్తం కులాల గుర్తింపు కోసం మాత్రమే. – జస్టిస్ బీఆర్ గవాయిఉప వర్గీకరణకు అనుకూలంషెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణకు అనుమతి వీలుకాదన్న ‘ఈవీ చిన్నయ్య’ కేసులోని తీర్పు సరికాదన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. క్రీమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయడం మరింత సమానత్వానికి తోడ్పడుతుంది. – జస్టిస్ విక్రమ్నాథ్తగిన డేటా సేకరించి అమలు చేయాలిరిజర్వేషన్ల ఉప వర్గీకరణకు రాజ్యాంగ చెల్లుబాటు ఉందన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. రాష్ట్రాలు తగిన డాటా సేకరించి ఉప వర్గీకరణ అవసరాన్ని నిర్ధారించాలి. ఇందు లో క్రీమీలేయర్ గుర్తింపునకు కూడా ఆవశ్యకత ఉండాలి. – జస్టిస్ సతీశ్చంద్రరాష్ట్రాలకు ఉప వర్గీకరణ అర్హత లేదుఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అర్హత రాష్ట్రాలకు లేదు. షెడ్యూల్డ్ కులాల పరిణామ చరిత్ర, నేపథ్యానికి తోడు రాజ్యాంగంలోని 341 కింద ప్రచురించిన రాష్ట్రపతి ఉత్తర్వులు కలసి షెడ్యూల్డ్ కులాలు ఒక సజాతీయ తరగతిగా మారాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, జాతులు లేదా తెగలను విభజించడం /ఉప వర్గీకరణ చేయడం/ పునర్విభజన చేయడం తద్వారా నిర్దిష్ట కులం/కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి చట్టాన్ని రూపొందించే శాసన అధికారం రాష్ట్రాలకు లేదు.రిజర్వేషన్లు కల్పించే ముసుగులో, బలహీనవర్గాలకు మంచి చేస్తున్నామన్న నెపంతో రాష్ట్రాలు రాష్ట్రపతి జాబితాను మార్చకూడదు, ఆర్టికల్ 341తో విభేదించకూడదు. రాష్ట్ర ప్రభుత్వ చర్య సదుద్దేశంతో ఉన్నా, రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి ధ్రువీకరించడం కుదరదు. సదుద్దేశ చర్య, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ రెండూ సమసమాజం లక్ష్యంగా ఉన్నా.. న్యాయబద్ధత, రాజ్యాంగ బద్ధతను పాటించాలి. – జస్టిస్ బేలా ఎం త్రివేది -
ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సీఎం రేవంత్ రియాక్షన్..
-
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై దామోదర రాజనర్సింహ రియాక్షన్
-
30 ఏళ్ల ధర్మపోరాటానికి ఫలితం దక్కింది: మందకృష్ణ
-
SC, ST వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తాజా చారిత్రక తీర్పులో.. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఒక్క జస్టిస్ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పును ఇచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6-1 తేడాతో తుది తీర్పు వెలువడింది. కేసు ఏంటంటే..వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చింది. అయితే ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ’ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని.. దీనిపై పునస్సమీక్షించాలని పేర్కొంటూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఫిబ్రవరిలో..ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిటిషన్ కూడా ఉంది. వీటిపై మూడురోజులపాటు వాదనలు జరగ్గా.. ఫిబ్రవరి 8వ తేదీన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. ఇప్పుడు.. ఐదు నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో ఇప్పుడు వెల్లడించింది.కేంద్రం వాదనలుఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు వినిపించింది. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని, రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. వెనుకబడిన వర్గాలు/కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం (ప్రభుత్వం) లక్ష్యం అని, వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయని వాదనలు వినిపించింది. -
రిజర్వ్డ్ కేటగిరీల ఉప వర్గీకరణ చెల్లుబాటుపై విచారణ నేడు
రిజర్వ్డ్ కేటగిరీల మధ్య ఉప వర్గీకరణ చెల్లుబాటుకు సంబంధించిన పిటిషన్లను నేడు భారత ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సుప్రీం కోర్టులో విచారించనుంది. బెంచ్‌లో న్యాయమూర్తులుగా బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ, సందీప్ మెహతా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అరుంథతియార్ కమ్యూనిటీ తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, న్యాయవాది జి బాలాజీ సహా దేశవ్యాప్తంగా పలు రిజర్వ్డ్ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు ఈ కేసుకు హాజరవుతున్నారు. ఈ ఉప వర్గీకరణ కేసు 2020 నాటిది. జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గతంలో బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర జాబితాలోని షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగలను రాష్ట్రాలు వారీగా ఉప వర్గీకరించవచ్చని పేర్కొంది. అయితే ఈ బెంచ్ తీసుకున్న అభిప్రాయం 2004లో ఈవీ ఛిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది. ఈ తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఏకపక్షంగా షెడ్యూల్డ్ కులాల సభ్యుల తరగతిలో ఒక తరగతిని చేర్చడానికి అనుమతించడం అనేది రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది. ఈ కేసులో కోఆర్డినేట్ బెంచ్‌ల విరుద్ధమైన అభిప్రాయాలను ఈ ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు పంపారు. ఈ నేపధ్యంలో విచారణ అనంతరం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలలో ఉప-వర్గీకరణను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర శాసనసభలు సమర్థవంతంగా ఉన్నాయో లేదో అనేది కోర్టు నిర్ణయించనుంది. -
ఎస్సీ వర్గీకరణ అంశంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి: కిషన్ రెడ్డి
హైదరాబాద్: దశాబ్దాల నాటి సమస్యలపై ప్రధాని మోదీ దృష్టి సారించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ చిత్తశుద్దితో పనిచేయలేదని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమస్యను ప్రధాని మోదీ అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను చేపడతామని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే.. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
పంజగుట్ట: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివారం నుంచి సమావేశాలు పూర్తయ్యే 22 వరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 3న జాతీయ స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్య నేతల సమావేశాలు, 4, 5 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు సమర్పించడం, 6న జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, 7న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన, 8న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 9న అన్ని మండలాల కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 18న ఢిల్లీలో మాదిగ ఉద్యోగుల నిరాహార దీక్ష, 19న ఢిల్లీలో మాదిగ మేధావులు, విద్యావంతుల దీక్ష, 20న మాదిగ జర్నలిస్టుల దీక్ష, 21న మాదిగ కళామండలి దీక్ష, 22న మాదిగ లాయర్ల దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
‘అయ్యో!’లకు ఆస్కారం ఇవ్వకుండా సమస్యకు పరిష్కారం చూపే సిక్స్ సెన్స్!
అంతా అయిపోయాక ‘అయ్యో!’ అనుకుంటాయి కొన్ని సంస్థలు. ‘అయ్యో!’లకు ఆస్కారం ఇవ్వకుండా సమస్యకు పరిష్కారం చూపుతుంది సిక్స్ సెన్స్. ఇది ఏ.ఐ ఆధారిత డిఫెక్ట్ ఎనాలటిక్స్ ప్లాట్‌ఫామ్. ఇద్దరు స్నేహితులు ఆకాంక్ష జగ్వానీ, అవ్నీ అగర్వాల్‌లు ప్రారంభించిన ఈ స్టార్టప్ విజయపథంలో దూసుకుపోతోంది. సాంకేతిక లోపాలను, కారణాలను ముందుగానే తెలియజేయడం ద్వారా ఈ టెక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. తమ ప్రాజెక్ట్‌పై నమ్మకం కలిగించేలా, పెట్టుబడి పెట్టేలా చేయడం స్టార్టప్ ఫౌండర్లకు సవాలు. ఇక పురుషాధిక్య రంగాలుగా ముద్రపడిన వాటిలో మహిళా స్టార్టప్ ఫౌండర్లకు ఇది మరింత పెద్ద సవాలు. కానీ ఈ అతిపెద్ద సవాలును ఎలాంటి అవరోధాలు లేకుండానే అధిగమించారు ఆకాంక్ష జగ్వానీ, అవ్నీ అగర్వాల్. సింగపూర్ కేంద్రంగా వీరు శ్రీకారం చుట్టిన స్టార్టప్ ‘సిక్స్‌సెన్స్’ (ఎస్ఎస్)కు లీడింగ్ వెంచర్ క్యాపిటల్స్ నుంచి నైతిక,ఆర్థిక మద్దతు లభించింది. ఇద్దరు ఉద్యోగులతో మొదలైన ఈ స్టార్టప్ విజయపథంలో దూసుకుపోతుంది. ‘సిక్స్‌సెన్స్’ అనేది ఏ.ఐ ఆధారిత డిఫెక్ట్ ఎనాలటిక్స్ ప్లాట్‌ఫామ్. సాంకేతికలోపాలను గుర్తించడంలో ఉపయోగపడే క్లాసిఫికేషన్ సాఫ్ట్వేర్ ఇది. ఏ.ఐ సాంకేతికతను ఉపయోగించి ‘ఎస్ ఎస్’ టెక్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రాడక్ట్స్‌ను స్కాన్ చేస్తోంది. ఎక్కువ నష్టం జరగక ముందే మాన్యుఫాక్చరింగ్ ఎక్విప్‌మెంట్‌లో లోపాలను గుర్తిస్తోంది. ఆపరేషనల్ మిస్టేక్స్‌లో అధిక ఆర్థిక నష్టం జరగకుండా చూస్తోంది. లోపాలను గుర్తించడం మాత్రమే కాదు, అవి ఎందుకు తలెత్తుతున్నాయో ఇంజనీర్లకు ఈ ప్లాట్‌ఫామ్ వివరిస్తుంది. ‘ఎస్ ఎస్’ కో–ఫౌండర్, సీటివో అవ్నీ అగర్వాల్ అలహాబాద్‌లోని ‘మోతిలాల్ నెహ్రు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో కంప్యూటర్ సైన్స్ చదువుకుంది. డాటా సైన్స్‌లో మంచి పట్టు ఉంది. చదువు పూర్తయిన తరువాత ఒక ప్రముఖ సంస్థలో పనిచేసి ‘బ్రిలియెంట్’ అనిపించుకుంది అగర్వాల్. ఈ సంస్థలో పనిచేయడం ద్వారా లాంచింగ్ ప్రాడక్ట్స్ నుంచి మెనేజింగ్ కంపెనీ కల్చర్ వరకు ఎన్నో విషయాలను ప్రాక్టికల్‌గా తెలుసుకుంది. ఆ సమయంలో తాను ప్రధానంగా గమనించిన విషయం ఏమిటంటే, టెక్నాలజీ పరంగా సంస్థలు ఏ మేరకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయని. డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన అనివార్యత ఉన్నప్పటికీ ఎన్నో పరిశ్రమలు దానికి దూరంగా ఉండడాన్ని అగర్వాల్ గమనించింది. పరిశ్రమలకు ఆధునిక సాంకేతికతను పరిచయం చేసే బాధ్యతను తానే తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. దీనికి ఎంతో అధ్యయనం అవసరం. కొత్త విషయాలు నేర్చుకోవడం అవసరం. తాను అందుకు రెడీ అయింది. అయితే ఏ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాలనే విషయంలో అగర్వాల్‌లో స్పష్టత లోపించింది. దీంతో తన స్నేహితురాలు ఆకాంక్షను కలుసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ...ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్న తరువాత తమ ప్రధాన టార్గెట్ ‘మాన్యుఫాక్చర్ ఇండస్ట్రీ’ అని తేల్చుకున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు మాన్యుఫాక్చరింగ్ రంగం అన్ని రకాలుగా అనుకూలమైనది అనే అంచనాకు వచ్చారు. అది పరీక్ష సమయం. మానసికంగా ఎంత బలంగా ఉన్నాసరే, ఏమవుతుందో ఏమో! అనే సందేహం చెవిలో జోరీగలా డిస్టర్బ్ చేస్తున్న సమయం. ఆ జోరీగను దగ్గర రాకుండా చేసి ‘ఎస్. మేము తప్పకుండా విజయం సాధిస్తాం’ అని ఒకటికి రెండుసార్లు గట్టిగా అనుకున్నారు ఇద్దరు మిత్రులు. ఒక ఫైన్‌మార్నింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంటర్ప్రెన్యుర్ ఫస్ట్ టాలెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి సింగపూర్ విమానం ఎక్కింది అవ్నీ అగర్వాల్. అలా సింగపూర్ కేంద్రంగా ‘సిక్స్ సెన్స్’ స్టార్టప్ పట్టాలకెక్కింది. సింగపూర్‌ను కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం అక్కడ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడమే. ‘మ్యాథ్స్ ప్రాబ్లం నుంచి టెక్నికల్ ప్రాబ్లం వరకు రకరకాల సమస్యలను పరిష్కరించం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అందులో చెప్పలేనంత సంతోషం దొరుకుతుంది. ఆ సంతోషమే నన్ను ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేలా చేసింది’ అంటుంది అవ్నీ అగర్వాల్. ‘ఎస్ ఎస్’ కో–ఫౌండర్, సీయివో ఆకాంక్ష జగ్వానీ(ముంబై) మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంది. ఆమెకి ప్రముఖ సంస్థలో పనిచేయడం కంటే ఒక సంస్థను ప్రారంభించి దాన్ని ప్రముఖ సంస్థల జాబితాలో కనిపించేలా చేయాలనేది కాలేజీ రోజుల నాటి కల. ‘ఎస్ ఎస్’ ద్వారా తన కోరిక నెరవేరింది. విజయపథంలో దూసుకుపోతున్న ‘సిక్స్ సెన్స్’ తాజాగా వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘టిన్‌మెన్’ నిధులతో మరింత విస్తరించే పనిలో ఉంది. ఆల్ ది బెస్ట్. -
‘ఎస్సీ’ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ అయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీస్) దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఎమ్మార్పీస్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఎస్సీల్లో ఎక్కువ జనాభాగా ఉన్నప్పటికీ మాదిగ ఉపకులాలకు తగిన రిజర్వేషన్లు వర్తించడం లేదన్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఈ అంశంపై ఇప్పటికే ఈవీ చిన్నయ్య కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే... ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఆలస్యం అవుతోందని, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వారికి మధ్యంతర పరిష్కారం ఇవ్వాలని కోరారు. అయితే కేసు విచారణ వేగవంతం చేయాలని రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరలేమని, అదే కేసులో ఇంప్లీడ్ కావాలని పిటిషనర్‌కు సీజేఐ సూచించారు. ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని రోహత్గి తెలపగా స్పందించిన సీజీఐ, ‘‘ఈ తరహా కేసులో విచారణ చేపట్టకుండా ఎవరైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారా?’’అని న్యాయవాదిని ప్రశ్నించారు. అనంతరం ‘‘రాజ్యాంగ ధర్మాసనం కేసులో ఇంప్లీడ్ కావడానికి పిటిషనర్‌కు అనుమతిస్తున్నాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రతివాదులకు నోటీసులు జారీ పూర్తయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలి’’అని ధర్మాసనం ఆర్డర్లో పేర్కొన్నారు. వర్గీకరణతోనే న్యాయం: మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరు గుతుందని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతున్నామన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతు: మధు యాష్కీ గౌడ్
ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలతో పాటు సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ఢిల్లీలోని కల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన స్టూడెంట్ మాదిగ పెడరేషన్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మందకృష్ణ మాదిగ సహాయాన్ని తీసుకుని.. అధికారంలోకి వచ్చాక ఆయనను జైల్లో పెట్టిన చరిత్ర కేసీఆర్‌దని మధు యాష్కీ మండిపడ్డారు. చదవండి: తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ఎస్సీల్లో మాదిగలు వెనుకబడ్డారన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని.. ప్రత్యేక రాష్ట్రంలో అయినా వారికి న్యాయం జరుగుతుందన్న లక్ష్యంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అయితే కేసీఆర్ పాలనలో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. దళితుల్లో మాదిగలు కిందిస్థాయిలో ఉన్నారు.. వారిని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలని మధు యాష్కీ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ కూడా మాదిగలను మోసం చేసింది. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ వారి మద్దతు తీసుకుని.. అధికారంలోకి వచ్చాక వారిని మోదీ మోసం చేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలి. దేశ సంపదలో దళితులు కూడా భాగమే. అట్టుడుగు వర్గాలకు అందాల్సిన సంపదను కూడా మోదీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున అమ్మేశాడు. దీనితో పాటు విద్యాసంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసి.. దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లను మోదీ దూరం చేస్తున్నాడు. తద్వారా దళితులకు విద్య అందకుండా చేస్తున్నాడని మధు యాష్కీ ఆరోపించారు. దళిత విద్యార్థులకు ఫెలోషిప్స్, స్కాలర్ షిప్స్ అందించాలని మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. -
వర్గీకరణకు జాతీయ విధానం అవసరం
సుప్రీంకోర్టు 27 ఆగస్టు 2020న సంచలన తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల వర్గీకరణను సమర్థిస్తూ సమస్య పరిష్కారానికి ఏడుగురు జడ్జీల ధర్మాసనానికి బదిలీ చేయాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ రవీందర్ సింగ్ కేసులో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను సమర్థించింది. ఈ తీర్పులో మూడు అంశాలపై స్పష్టత నిచ్చింది. (1) పంజాబ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతుల చట్టం 2006, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చెల్లుతుందా, లేదా? (2) రాష్ట్ర ప్రభుత్వాలకు షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించి చేసే రిజర్వేషన్ల అమలుపై అధికారం ఉందా, లేదా? (3) ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు 2004లో ఇచ్చిన ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు తీర్పును పునఃసమీక్షించాలా, లేదా? సుప్రీంకోర్టు ప్రధానంగా భారతదేశం ఫెడరల్ స్ఫూర్తి కల్గిన దేశం అని పేర్కొంటూ ఆర్టికల్ 15(4), 16(4) ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు విద్యా, ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యం లేనట్లయితే రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వానికి ఎంత అధికారం ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అవే సర్వాధికారాలు ఉన్నాయని తెలుపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలిపింది. కానీ ఏదైనా కులాన్ని/తెగను ఎస్సీ/ఎస్టీ జాబితాలో చేర్చడం లేదా తొలగించే అధికారం మాత్రం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్డు కులాల జాబితాను, ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డు తెగల జాబితాను, ఆర్టికల్ 342ఎ ప్రకారం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితాలను పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం 2006 రిజర్వేషన్ చట్టం ద్వారా ఎస్సీలను వర్గీకరించి విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్ల అమలుకు ముందడుగు వేసింది. కానీ సదరు చట్టాన్ని పంజాబ్ – హర్యానా హైకోర్టు బెంచ్ కొట్టివేస్తూ దానికి కారణంగా ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ ఎస్సీ, ఎస్టీల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదని తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం 2000 సంవత్సరంలో షెడ్యూల్డు కులాలను నాలుగు గ్రూపులుగా ప్రత్యేక చట్టం ద్వారా వర్గీకరించి 15 శాతం రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టింది. సదరు చట్టాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మల్లెల వెంకట్రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 4:1 మెజారిటీ తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టానికి ఆమోదం తెలిపింది. వెంటనే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అందుకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 2004లో ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో తీర్పునిస్తూ ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని కొట్టివేస్తూ ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా తేల్చిచెప్పింది. సామాజిక రిజర్వేషన్లకు సంబంధించి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు తీర్పులో సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 6:3 మెజారిటీ తీర్పులో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ ఓబీసీల వర్గీకరణకు కూడా ఆమోదం తెలిపింది. కానీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వేరుగా చూడాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నేటి వరకు 1,206 కులాలను ఎస్సీలుగా, 701 తెగలను ఎస్టీలుగా, 2,643 కులాలను ఓబీసీలుగా గుర్తించి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఇందులో ఓబీసీ జాబితాలలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కొద్దిపాటి తేడాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణ కోసం 2017లో జస్టిస్ రోహిణి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక సమర్పణ కాలాన్ని జనవరి 2021 వరకు పొడిగించింది. అనేక రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ విద్యా ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నప్పటికీ, అమలు చేస్తున్న రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగిం చాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఏ కులాలు/ తెగలు విద్యలో ముందుంటాయో లభిస్తున్న కాస్త రిజర్వేషన్లు వారే అనుభవించడం సహజం. కాబట్టి వర్గీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలుపరిచి ఆయా కులాలకు/తెగలకు న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. లేనట్లయితే ఆయా కులాల/తెగల మధ్య వైరుధ్యాలు పెరిగి సమైక్యతకు భంగం వాటిల్లుతుంది. కోడెపాక కుమార స్వామి -వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 94909 59625 -
వర్గీకరణలో మార్పులు అవశ్యం
స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల వర్గీకరణపై అవకతవక లను సరిదిద్ది, అన్ని వెనుకబడిన వర్గాలకు సరైన అవకాశాలు, సమాన ప్రాతినిధ్యం కోసం దామాషా ప్రకారం ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ చేయాలి. స్థానిక సంస్థల్లో వెనుకబ డిన తరగతులకు రిజర్వే షన్లు కల్పించే విషయంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు నిర్మాణాత్మక హోదాను కల్పించి ఎస్సీ, ఎస్టీల తోపాటు వెనుకబడిన తరగ తుల వారికి రిజర్వేషన్లు కల్పించారు. అయితే ఈ ముఖ్యమైన, క్లిష్టమైన వెనుకబడిన తరగతుల వర్గీకరణను సిఫారసు చేసిన అనంతరామన్ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వాలు విస్మ రించాయి. పైగా అనేక హైకోర్టులు, సుప్రీంకోర్టు సైతం సమర్థించిన శాస్త్రీయ వర్గీకరణ ప్రతిపాదన లను అవహేళన చేయడమే కాకుండా అందరు వెను కబడిన తరగతుల వారిని ఒకే గాటన కట్టి, స్థానిక సంస్థలలో 1/3 వంతు రిజర్వేషన్లను కేటాయి స్తూ జీవో విడుదల చేశాయి. దీని ఫలితంగా తెలంగాణలో గత 30 ఏళ్లలో స్థానిక సంస్థల్లో మున్నూరు కాపు, యాదవ, గౌడ, ముదిరాజ్, పెరిక, పద్మశాలి వంటి కొన్ని కులాల వారు మాత్రమే ఈ 1/3వ వంతు సీట్లలో 86 శాతాన్ని రాబట్టుకున్నారు. ఏపీలో కూడా కొన్ని కులాలవారికి మాత్రమే ఇలా లబ్ధి చేకూరింది. దీంతో ఇది స్థానిక సంస్థల్లో అంటే గ్రామాలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వెనుక బడిన తరగతులలో సాంఘిక, ఆర్థిక అసమానతలను పెంచి స్థానిక సంస్థల పరిపాలనలో అసమతుల్యతను ఏర్పరిచింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పర్చిన సమగ్ర సర్వే ప్రకారం తెలంగాణలో వెనుకబడిన తరగతుల జనా భాను 52%గా అంచనా వేశారు. అందులో వెనుక బడిన తరగతుల రిజర్వేషన్లలో సింహభాగాన్ని రాబ ట్టుకొన్న పైన పేర్కొన్న 6–8 కులాల జనాభా 18–20%గా అంచనా వేయడమైంది. పైన పేర్కొన్న వాస్తవాలు, గణాంకాల ఆధారంగా చూస్తే, 32%లో ఉన్న మిగిలిన 90+ వెనుకబడిన కులాల జనాభా ప్రాతినిధ్యం స్థానిక సంస్థల పదవులలో చాలా తక్కు వగా ఉందని గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో బలహీనవర్గాల సాధికార తను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మార్కెట్‌యార్డ్ కమిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అమలుపరిచింది. కానీ, ఈ పథకంలో కూడా అనంతరామన్ కమిషన్ వెనుకబడిన తరగతు లపై చేసిన సిఫారసులపై అవగాహనా రాహిత్యం వల్ల, వెనుకబడిన తరగతుల వర్గీకరణ విస్మరణకు గురైంది. స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లలో వర్గీకరణ పాటించక పోవటం వల్ల తీవ్రంగా నష్టపోయిన మిగతా వెనుకబడిన కులాల వారు కొందరు ఈ విషయాన్ని ఠీ.p. పిల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పై రెండు సందర్భాలలో కూడా హైకోర్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లలో వెనుకబడిన తరగతుల వర్గీకరణ విధా నాన్ని అమలుపరచమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2013 సంవ త్సరం ఇచ్చిన తీర్పును అమలుపరుస్తూ స్థానిక సంస్థ లలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణను అమలుపరచాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతులు ఎ గ్రూప్ పరిరక్షణ సమితి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అభ్యర్థిస్తోంది. వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం కల్పించే వివిధ అవకాశాలలో వెనుకబడిన తరగతుల సమాన ప్రాతినిధ్యం కోసం వారిని వర్గీకరించే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా యూఎస్వీ బలరాం, ఎం.ఎస్. ఇంద్ర సాహ్నే కేసులో సమర్థించింది. వెను కబడిన తరగతి ఏ–గ్రూపు వారు సంచార జాతులు, మిగిలిన కులాలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు. కాబట్టి బీ, సీ, ఏ గ్రూపులో ఇతర కులాల వారిని ఎవ్వరినీ కూడా కలుపకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి. వెనుకబడిన తరగతులలో అన్ని వర్గాలకు నిమ్న వర్గాలకు నిమ్న వర్గాల అభివృద్ధి ఫలాలను సమా నంగా పంచేందుకు ఏబీసీడీ వర్గీకరణను చేశారు. దానికి అనుగుణంగా కమిషన్ వారి వారి జనాభా నిష్పత్తిని అనుసరించి మొత్తం వెనుకబడిన తరగతు లకు కల్పించిన రిజర్వేషన్లను ఆ నాలుగు వర్గాలకు సమానంగా పంచాలని సూచన చేసింది. కానీ, ఆ సూచనను అర్థం చేసుకోవటంలో అవగాహనా రాహిత్యంవల్ల వర్గీకరణ అమలు అత్యంత లోపభూయిష్టంగా తయారైంది. గత 30 ఏళ్లుగా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి, వెనుకబడిన వర్గాల అసలు జాబితాలోని అన్ని కులాలకు సమా నమైన అవకాశాలను కల్పిస్తూ ఇచ్చిన 33.33 శాతంలో అన్ని వర్గాలకు సరైన నిష్పత్తి ప్రకారం రాష్ట్ర రిజర్వేషన్లను కల్పించాలి. రాబోయే 2018 స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలో వెనుకబడిన తరగతుల ఏబీసీడీ వర్గీకరణను ఖచ్చితంగా అమలుపర్చేందుకు సరైన అధ్యయనం జరిపి జీవోను విడుదల చేయాలి. ఆవిధంగా ప్రస్తుతమున్న స్థానిక సంస్థల్లో వెనుకబ డిన తరగతుల రిజర్వేషన్ వి«ధానంలో నిర్లక్ష్యానికి గురైన, అణగారిన, వెనుకబడిన తరగతుల ప్రజలకు –బి.సి.ఎ–ప్రభుత్వం తగు న్యాయం చేకూర్చాలి. వ్యాసకర్త రిటైర్డ్ ఎస్పీ ‘ 99665 18033 దుగ్యాల అశోక్ -
ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రతిఘటిస్తాం
కాకినాడ సిటీ : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లి రాజేష్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి వ్యతిరేకంగా బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల మధ్య విభేదాలు సృష్టించడానికి, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్రమంత్రి వెంకయ్య ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు చెల్లదని ఒక పక్క కోర్టు స్పష్టం చేసినా అదే అంశాన్ని తెరమీదకు తీసుకురావడంలోని ఔనత్యం ఏంటని ప్రశ్నించారు. వర్గీకరణ జోలికొస్తే వెంకయ్యనాయుడుకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వెంకయ్య, అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా రాదని రెండు నాల్కల« ధోరణితో మాట్లాడటం సరికాదన్నారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బీఎన్ రాజు, రామారావు, లోవరాజు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
మిర్యాలగూడ టౌన్ : ఎస్సీవర్గీకరణ చట్టభద్ధతను కల్పించేంత వరకు ఉద్యమం ఆగదని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి పులిపాటి ప్రకాశ్‌మాదిగ, జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమయ్య అన్నారు. సోమవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జరిగిన ఎమ్మార్పీఎస్ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేవానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మాణం చేసి వదిలేసిందని, కేంద్రంపై ఒత్తిడిని తీసుకొచ్చేందుకు కేసీఆర్ అఖిలపక్ష పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. నవంబరు 20న హైదరాబాద్‌లో 30లక్షల మంది దళితులతో మాదిగల ధర్మయుద్ధ మహాసభను నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6న నల్లగొండలోని బండారి గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంద కృష్ణమాదిగ హాజరవుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ ఏడుకొండలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తలకొప్పుల సైదులు, ఇరుగు ఎల్లయ్య, నాయకులు ఉబ్బపల్లి రాజశేఖర్, రామ్‌లక్ష్మణŠ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డుకునేవారికి బుద్ధి చెబుతాం
వినాయక్‌నగర్ : ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేవారికి బుద్ధి చెబుతామని జాతీయ ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వెంకటస్వామి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోగల ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో ఎస్సీవర్గీకరణను కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయన్నారు. ఎస్సీవర్గీకరణ ఆగదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాల అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం వచ్చేనెల 20న హైదరాబాద్‌లో ధర్మ యుద్ధం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వచ్చేనెల 3న సన్నాహక సదస్సు నిర్వహిస్తామన్నారు. సదస్సులో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణం మాదిగ, రాష్ట్ర నాయకులు గంగాధర్, పోశెట్టి, యమున, తార, శ్రీనివాస్, తోబేవార్ సంతోష్, విఠల్, తిమప్ప, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తుది దశకు వర్గీకరణ ప్రక్రియ
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు గాంధీనగర్ : ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఉద్యమం కీలక దశకు చేరుకుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 10 వరకు డిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనకు అధికార, ప్రతిపక్షాలు మద్దతిచ్చాయన్నారు. ఈనెల 24 నుంచి హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల మేథోమదన సదస్సు, 26న అన్ని కుల, ప్రజాసంఘాల మేథోమదన సదస్సు, 27న అన్ని రాజకీయ పార్టీలలోని సీనియర్ నాయకుల మేథోమదన, 28న ఉద్యోగులు, మేధావులు, 29న ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన బుద్దిజీవులతో, సెప్టెంబర్ 4న మాదిగ ప్రజల ప్రతినిధులతో సదస్సులు నిర్వహించనున్నామని వివరించారు. సమావేశంలో జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్, పరసా రామయ్య, కోట దానియేల్, మానికొండ శ్రీధర్, లింగాల నర్సింహులు, కాంపాటి వెంకటేశ్వరరావు మాదిగ, టోని మాదిగ, రోజ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ చట్టవిరుద్ధం
ఉట్నూర్ : ఎస్సీ వర్గీకరణ కోసం ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం అనడం సిగ్గు చేటని అసలు ఎస్సీ వర్గీకరణ చట్ట విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని తెల్చి చెప్పిన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఎస్సీలను పావుగా వాడుకుంటున్నాయని తెలంగాణ నేతకాని (మహార్) రిజర్వేషన్ పొరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోత్తపల్లి మహేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దిష్టి బోమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని వెంటనే ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నేతకాని (మహార్) రిజర్వేషన్ పొరాట సమితి మండల అధ్యక్షుడు దూట మహేందర్, జిల్లా కార్యదర్శి కాంబ్లే రవికాంత్, నాయకులు కేశవ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో మాల సంఘం నాయకుల ధర్నా
మందమర్రి : ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాల సంఘం ఆ«ధ్వర్యంలో చేపట్టిన దీక్షలో పట్టణ మాల సంఘం నాయకులు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల సంఘం పట్టణ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ దళితుల ఐక్యత దెబ్బతీసేందుకే కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు సుప్రీం కోర్టు సైతం వర్గీకరణ సరైంది కాదని తీర్పు చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీక్షలో కూర్చున్న వారిలో మెయ్య రాంబాబు, పల్లే నర్సింహులు, కొండ రాములు, బావండ్ల వీరస్వామి తదితరులున్నారు. -
బీసీల్లో వర్గీకరణ ఐక్యతను పెంచింది
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ సాక్షి, న్యూఢిల్లీ: గత 30 ఏళ్లుగా వెనకబడిన తరగతుల్లో వర్గీకరణ అమలవుతున్నా బీసీల్లో ఎక్కడా ఐక్యత లోపించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ బీసీల మధ్య ఐక్యతకు దారి తీసింది తప్ప ఘర్షణకు కారణం కాలేదన్నారు. అలాంటప్పుడు ఎస్సీల్లో వర్గీకరణకు కొంతమంది స్వార్థపరులు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వర్గీకరణ కోసం ఢిల్లీలో చేపట్టిన ఎమ్మార్పీఎస్ ఆందోళన ఆదివారం 20వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వర్గీకరణ వాదులు కలసి ఉద్యమించాలని ఆందోళనకు మద్దతు పలికిన హరియాణా వర్గీకరణ ఉద్యమ సారథి సోదేష్ కబీర్ పిలుపునిచ్చారు. వర్గీకరణ ఉద్యమానికి బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్‌గౌడ్ చెప్పారు. ఎస్సీల వర్గీకరణ కోరుతూ మాలల సంఘీభావ కమిటీ జంతర్‌మంతర్ వద్ద ఆదివారం దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా కమిటీ జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు మాల మాట్లాడుతూ.. వర్గీకరణకు అందరూ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎమ్మార్పీఎస్, తెలంగాణ మాదిగ జేఏసీ, మాదిగ దండోరా ఆధ్యర్యంలో జంతర్‌మంతర్‌వద్ద సోమవారం నుంచి 3 రోజులు ఆందోళనలు చేపట్టనున్నారు. -
గద్దర్ మాలలకు ద్రోహం చేస్తున్నారు
సుల్తాన్‌బజార్: ప్రజా గాయకులు గద్దర్, కాకి మధవరావు, కోదండరామ్ ఒకే సామాజిక వర్గానికి కొమ్మకాస్తున్నారని వీరు మాలల ద్రోహులని మాల సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆవుల బాలనాథ్ అన్నారు. శనివారం కోఠిలోని సంఘం కార్యాలయంలో ఆగమయ్య, విజయ్‌బాబు, దాసరి భాస్కర్, మన్నేశ్రీరంగ, చెరుకు రామ్‌చందర్‌లతో కలిసి మాట్లాడారు. నిజాం లా కళాశాలలో శుక్రవారం జరిగిన సంఘటనలో మాదిగలే మాలలపై దాడి చేశారని, వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ స్వార్ధం కోసమే మాల సామాజిక వర్గానికి చెందిన గద్దర్, కాకి మాధవరావు వర్గీకరణకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. కాకి మాధవరావు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మాలలకు చేసిందేమీ లేదని, గద్దర్ కమ్యూనిస్టు భావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొదండరామ్ వర్గీకరణకు మద్దతు పలకడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దర్, కాకిమధవరావు ఇచ్చే వినతిని స్వీకరిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహిస్తుందని వారు హెచ్చరించారు. సమావేశంలో ప్రేమ్‌కుమార్, మోహన్, శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ రచ్చ
-
‘వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి’
కాగజ్‌నగర్ : ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చెన్నూరి శ్రీనివాస్ మాదిగ, జలంపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎల్కటూరి అంజయ్య మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎస్సీ వర్గీకరణకై ప్రధాని నరేంద్ర మోడికి లేఖ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి మాన్సూన్ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు (25 రోజుల పాటు) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగనున్న ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల రిలే దీక్షలు, ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు రమేశ్ మాదిగ, దుర్గ ప్రసాద్ మాదిగ, తిరుపతి మాదిగ, కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ
-
వాయిదా పద్ధతొద్దు దేనికైనా
బద్ధకిష్టులకు పరిష్కార మార్గాలు ‘అబ్బబ్బ... ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న పని.ఇప్పటికీ పూర్తి కాలేదు... ’ మనలో చాలామంది నోట తరచూ వినిపించే మాట ఇది. నిజానికి ఇది ఒక లోపమే! ఒక్క ముక్కలో చెప్పాలంటే - వాయిదా మనస్తత్త్వం. స్థాయిలో తేడా ఉండవచ్చేమో కానీ, మనస్తత్త్వం మాత్రం కామన్. చెడు అలవాట్లు మానుకోవడం, మంచి అలవాట్లు చేసుకోవడం, చదువులో పూర్తి చేయాల్సిన పోర్షన్, ఆఫీసులో పూర్తి చేయాల్సిన పని - ఇలా రకరకాల వాటిలో ఈ లక్షణం తొంగి చూస్తుంటుంది. ఇలాంటి మనస్తత్త్వం ఉండేవారందరినీ మనస్తత్త్వ నిపుణులు వివిధ వర్గాలుగా విభజించారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎలా ఉంటారు, ఒత్తిడి పెరిగితే తడబడిపోతారా, ఫెయిల్యూర్ వస్తే తట్టుకుంటారా లాంటి పలు అంశాల ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు. ఆ వర్గీకరణ, అలాంటి వాయిదా మనస్తత్త్వం ఉన్నవాళ్ళు తమను ఎలా చక్కదిద్దుకోవాలో చూద్దాం... అతి ధైర్యవంతుల రకం ఈ రకమైన వాయిదా వ్యక్తులు ఆఖరు క్షణంలో పని మొదలుపెడతారు. ఆఖరు క్షణం దగ్గర పడుతోందనే ఒత్తిడి ఉన్నప్పుడే తాము బాగా పనిచేయగలుగుతామని భావిస్తారు. సర్వసాధారణంగా వీళ్ళు తమ బద్ధకం కారణంగా ఆఖరు నిమిషం వరకు పని వాయిదా వేసుకుంటూ వస్తారు. చివరికి వచ్చేసరికి హడావిడిగా పని పూర్తి చేయాల్సొచ్చి, పొరపాట్లు చేసే ప్రమాదం ఉంటుంది. ఈ రకం వ్యక్తులు పని విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ, ఆ పని ఎంత నాణ్యంగా పూర్తయిందన్న దానిపై పట్టింపు పెట్టుకోరు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులు మెడ మీద కత్తి లాంటి డెడ్లైన్లు పెట్టుకోవాలి. ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకుంటూ వెళ్ళాలి. తమ పనిని తామే అంచనా వేసుకుంటూ పోవాలి. పనిని అనుకున్నట్లు పూర్తి చేస్తే తమను తాము అభినందించుకోవాలి. పూర్తి చేయకపోతే తమకు తామే పనిష్మెంట్ కూడా వేసుకోవాలి. అలా స్వీయ నియంత్రణ వల్ల వాయిదా మనస్తత్త్వాన్ని దూరం చేసుకోగలుగుతారు. పనికి అడ్డంకులు సృష్టించుకొనే రకం ఈ రకం వాయిదా మనుషులు కూడా ఆఖరి నిమిషంలో ఒత్తిడి మధ్య పనిచేస్తేనే తాము బాగా పనిచేయగలమని పొరపడుతుంటారు. వీళ్ళలో విచిత్రం ఏమిటంటే - తమ పనికి తామే అడ్డంకులు సృష్టించుకుంటూ ఉంటారు. పనిచేసే క్రమంలోని ఈ అడ్డంకుల రీత్యా తమకు తామే ఆ పని నుంచి పక్కకు వస్తారు. పనిలో ఆలస్యమేమిటని అడిగితే, ఆ తప్పు మరొకరి మీద నెట్టేస్తుంటారు. అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా, పనిలో క్వాలిటీ మాత్రం తగ్గకూడదనుకుంటారు. పరిష్కారం: మీరు గనక ఇలాంటి రకం వ్యక్తులైతే, అడ్డంకుల గురించి కూడా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు, పనిలో కాసేపు విరామం తీసుకొని, ఆ టైమ్‌లో ఫేస్బుక్ చూసుకోవడం మీకు అలవాటు అనుకుందాం. దీని వల్ల పని టైమ్ వృథా అవుతుంది. ఆ మేరకు పని ఆలస్యమవుతుంది. ఈ సంగతి గ్రహించి, మీ లంచ్ బ్రేక్ టైమ్‌లోనో ఏమో ఈ ఫేస్బుక్ చూసే వ్యవహారం పెట్టుకున్నారనుకోండి. ఇటు ఫేస్బుక్ చూడడం ఆగదు. అటు పని సమయం వృథా కాదు. మామూలు టైమ్‌కే పని పూర్తయిపోతుంది. డెసిషన్‌ని తప్పించుకొనే రకం ఈ రకం వాయిదా మనుషులు ఏ నిర్ణయమూ తీసుకోకుండా వాయిదా వేస్తుంటారు. వీళ్ళకు పని విషయంలోనూ భయమే. ఆ భయంతో పని అసలు మొదలే పెట్టరు. ఇలా నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల ఫెయిల్యూర్ వస్తుందని కానీ, ఇతరులు తమను అంచనా వేస్తారని కానీ భయం ఉండదు కదా అని తృప్తి పడుతుంటారు. ఫలానా టైమ్‌లోగా పని పూర్తి కావాలనే డెడ్లైన్లు ఉన్నాయంటే, తెగ బాధపడిపోతారు. చేసే పని నాణ్యంగా ఉండాలని అనుకుంటారు కానీ, ఆఖరు నిమిషంలోని ఒత్తిడిని సరిగ్గా సంబాళించుకోలేరు. సాధారణంగా ఈ రకం వ్యక్తులు తమ పనితో సంతోషంగా ఉంటారు. కానీ, ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని తెగ వర్రీ అవుతుంటారు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకొనేందుకు గట్టిగా నిర్ణయించుకోవాలి. ‘‘మనం ఏం చేసినా ఎదుటివాళ్ళు కొందరు జడ్జ్ చేసి, ఏదో ఒకటి అంటారు. కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ కూడా అవుతాం. అయినా ఫరవాలేదు. ప్రపంచమేమీ తలకిందులు కాదు. దాని నుంచి కూడా నేర్చుకుంటా’’ అని తమకు తామే గట్టిగా చెప్పుకోవాలి. పక్కవాళ్ళ మీద నెట్టేసే రకం ఇలాంటి రకం వ్యక్తులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో గందరగోళంలో ఉంటారు. అందుకే, ఇతరులనే నిర్ణయం తీసుకోనిస్తారు. ఈ గందరగోళం వల్ల పని ఆలస్యమవుతుంది. ఫెయిల్యూర్ భారాన్ని కూడా ఇతరుల మీదే పడేస్తారు. వీళ్ళకు కూడా తమ పని పట్ల సంతృప్తి ఉంటుంది కానీ, ఇతరులు ఏమంటారోనన్న శంక పీడిస్తూ ఉంటుంది. ఈ రకం వాయిదా మనుషులు ఒక పట్టాన పని మొదలుపెట్టరు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులకు ఏది ముందుగా ఎంచుకోవాలనే మీమాంస వచ్చినప్పుడు - రెండు రకాల మార్గాలున్నాయి. ఉన్నవాటిలో అతి పెద్ద పనిని ముందుగా చేపట్టి, అది అయ్యాక మిగిలిన చిన్న పనుల్లోకి వెళ్ళాలి. ఇక, రెండో పద్ధతి ఏమిటంటే - పెద్ద పనిని ముందుగానే చిన్న చిన్న పనులుగా విడగొట్టుకోవాలి. ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం మీద తమలోని వాయిదా మనస్తత్త్వాన్ని ఎవరికి వారు గుర్తించి, సరిదిద్దుకోవాలి. బద్ధకాన్ని వదిలించుకొని, పనిలో పడాలి. పైన చెప్పిన పరిష్కార మార్గాల్ని అలవాటు చేసుకోవాలి. అందుకోసం మానసికంగా కృతనిశ్చయంతో ఉండాలి. వాయిదా పద్ధతిని సరైన సమయంలో మార్చుకుంటే, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. పనిలో పురోగతితో, జీవితం కూడా ఆనందంగా మారుతుంది. మరింకేం... వాయిదా వేయకుండా ఆచరణలో పెట్టండి. ఆల్ ది బెస్ట్! ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలనుకొనే రకం ఈ రకం వ్యక్తులు తమ పని ఏ మాత్రం తప్పు లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలని, అసలు విమర్శలే రాకూడదనీ అనుకోవడం వల్ల ఆలస్యం జరుగుతుంటుంది. ఈ పర్ఫెక్షనిజమ్కి మూలకారణం ఏమిటంటే మనస్సులోని ఆందోళన. వీళ్ళు పని మొదలుపెట్టేస్తారు కానీ చేయాల్సిన పనుల జాబితా మాత్రం కొండవీటి చాంతాడంత ఉంటుంది. కాబట్టి ఒత్తిడి ఎదురైనప్పుడు తడబడతారు. ఇలాంటి పర్ఫెక్షనిస్టులు అవతలివాళ్ళు ఏమంటారో అన్న దాని గురించి అతిగా ఆలోచిస్తుంటారు. ఇతరుల్ని నిర్ణయం తీసుకోనిచ్చి ఆందోళనను అప్పటికి దూరం చేసుకుంటూ ఉంటారు. పరిష్కారం: పర్ఫెక్షనిజమ్ తప్పు కాదు కానీ పనిని వాయిదా వేయకుండా టైమ్‌కి పూర్తి చేయడం కోసం ఇలాంటి వ్యక్తులు ‘ఎస్.ఎం.ఎ.ఆర్.టి’ (స్మార్ట్ -స్పెసిఫిక్, మెజరబుల్, ఎటైనబుల్, రిలవెంట్, టైమ్ బౌండ్) లక్ష్యాలను పెట్టుకోవాలి. లక్ష్యాలు నిర్ణీతంగా, అంచనా వేయడానికి వీలుగా, అందుకోదగినట్లుగా ఉండాలి. సమయానికి తగ్గవై ఉండాలి. నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా ఉండాలి. ఎవరం ఏ పని చేసినా అందులో అసలు తప్పులే లేకుండా ఉండడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. చేసే పనిలో ఎప్పటికప్పుడు మెరుగుదల సాధించాలి. -
'మహానాడులో ఎస్సీ వర్గీకరణపై చర్చించాలి'
ఏలూరు: తిరుపతిలో నిర్వహించే టీడీపీ మహానాడులో ఎస్సీ వర్గీకరణపై చర్చించి తగు తీర్మానం చేయకపోతే మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఏపీ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు హెచ్చరించారు. శుక్రవారం ఏలూరులో నిర్వహించిన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. మహానాడు తొలిరోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. రెండో రోజున ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు చేస్తామని, అప్పటికీ వర్గీకరణపై తీర్మానం చేయకపోతే ఛలో తిరుపతి కార్యక్రమం నిర్వహించి మహానాడు వేదిక వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎటువంటి ఘటనలు జరిగినా అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై ఇంకా అలసత్వం వహిస్తే జూన్ 30న అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో లక్ష మందితో దండయాత్ర మహాసభ నిర్వహిస్తామన్నారు. ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జన్ని రమణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై చర్చించి తీర్మానం చేయకపోతే 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెడతామన్నారు. వర్గీకరణకు బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా వర్గీకరణపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీరామ దేవమణి, రాష్ట్ర యువసేన అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు, జాతీయ కో కన్వీనర్ కలివెల ఎలీషా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బుంగా సంజయ్, ఏపీఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె లాజరస్, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు పాల్గొన్నారు. -
వర్గీకరణ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
♦ రిలే నిరాహార దీక్ష ముగింపులో మంద కృష్ణ మాదిగ ♦ నమ్మకద్రోహులు రాజ్యమేలుతున్నారని ధ్వజం ♦ వర్గీకరణపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ♦ స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ కోసం 22 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమం అనేక త్యాగాల సమ్మేళనమని, మలి దశలో జరుగుతున్న ఈ ఉద్యమంలో వర్గీకరణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం జంతర్ మంతర్వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష చివరి రోజు శుక్రవారం ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణే మాదిగ జాతికి సర్వస్వం అని, విద్య, ఉద్యోగ రంగాలతోపాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ ఉన్నతి కే వలం ఎస్సీ వర్గీకరణతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల త్యాగాల మీద నిలబడ్డాయని పేర్కొన్నారు. చిన్నరాష్ట్రాల వల్లే అభివృద్ధి సాధ్యమని అంబేడ్కర్ చెప్పిన మాటను గౌరవించి ప్రత్యేక రాష్ట్ర సాధనలో మాదిగలు ముందున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలని ఎమ్మార్పీఎస్ భావించిందని, కానీ దొరలకు మాత్రమే న్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టేందుకు భయపడుతున్న రోజుల్లో ఎమ్మార్పీఎస్ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించిందని, వర్గీకరణ అంశం లేకుండా చంద్రబాబు ప్రసంగం ఉండేది కాదని పేర్కొన్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే మోసపూరితంగా వ్యవహరించడం నీచాతినీచమని విమర్శించారు. నమ్మక ద్రోహులు రాజ్యమేలడం బాధాకరమని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ విషయంలో బీజేపీ ఆలస్యం చేయరాదని కోరారు. కాగా దీక్షకు సంఘీభావం తెలిపిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీని శంకించవద్దని అన్నారు. తమ పార్టీ వర్గీకరణకు పూర్తి మద్దతుగా నిలిచిందని తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ వర్గీకరణ చేసిందని, వర్గీకరణ బిల్లు ఎప్పుడు పెట్టినా మద్దతు తెలిపేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం న్యాయమైన ఉద్యమమని అన్నారు. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఈ డిమాండ్‌పై లేఖలు రాశామని గుర్తుచేశారు. చివరి రోజు దీక్షలో ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగడి సత్యం, ఎమ్మెస్పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్ గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోళ్ల వెంకటేశ్, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, ఇతర నేతలు ప్రతాప్ కుమార్, గోవింద్ నరేశ్, మాతంగి ఓదేలు తదితరులు పాల్గొన్నారు. -
'వర్గీకరణపై తాడోపేడో తేల్చుకుంటాం'
విజయవాడ (గాంధీనగర్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నారని, వర్గీకరణపై ఇక తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడలోని కందుకూరి కల్యాణమండపంలో బుధవారం జరిగిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ చేపట్టి పెద్ద మాదిగనవుతానని ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక వర్గీకరణ అంశాన్ని పక్కన బెట్టి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇద్దరు సీఎంలు కలిసి వర్గీకరణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన, వర్గీకరణ కోసం సెప్టెంబర్ 10న కర్నూలు జిల్లాలో మాదిగల రణభేరి సదస్సు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 30న విజయవాడలో మహిళా ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.సుబ్బయ్య (కర్నూలు), విజయరామ్ (పశ్చిమ గోదావరి), పి.సుబ్బయ్య (నెల్లూరు), రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నల్లూరి చంద్రలీల, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాదిగ, గౌరవాధ్యక్షురాలు బూదాల నందకుమారి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. -
ఒళ్లు బరువు?కళ్లు తెరువు!
స్థూలకాయం సమస్య తీవ్రంగా మారింది. ప్రజల జీవనశైలిపై దాని ప్రభావాలు విపరీతంగా ఉంటూ ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలకు అది కారణమవుతోంది. ఉదాహరణకు స్థూలకాయం చాలామందిలో డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, క్యాన్సర్లు, శ్వాససంబంధమైన వ్యాధులకు దారితీస్తుంది. ఈ శతాబ్దానికి అదో పెద్ద విపత్తుగా మారిందనడం అతిశయోక్తి కాదు. భారత్‌లో కనీసం ఆరు శాతం ప్రజలు స్థూలకాయం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిత్రం ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ స్థూలకాయం సమస్య ఎంత విపరీతంగా పెరుగుతోందో, భారత్‌లోనూ అదే తరహాలో అధికమవుతోంది. దేశంలోనే కాదు... తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లూ ఈ తరహా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనూ 18 శాతం పురుషుల్లో, 23 శాతం మహిళల్లో ఈ సమస్య కనిపిస్తోంది. ఈ నెల 26న ప్రపంచ స్థూలకాయం దినం సందర్భంగా ఈ సమస్య తీవ్రతనూ, అది తెచ్చే ఆరోగ్యఅనర్థాలపై అవగాహన కోసం ఈ కథనం. స్థూలకాయం అంటే...? ఆరోగ్యకరమైన శరీరంలో జీవక్రియల కోసం నిత్యం అనేక పోషకాలు దహనం అవుతూ ఉంటాయి. ఇలా జీవక్రియల కోసం దహనం కాని పోషకాలు కొవ్వు రూపాన్ని సంతరించుకుని శరీరంలోని వేర్వేరు భాగాల్లో పోగుపడుతుంటాయి. ఇలా శరీరంలోని వేర్వేరు భాగాలు కొవ్వులను అనారోగ్యకరమైన రీతిలో నింపుకోవడం వల్ల శరీరం లావుగా మారి, బరువు పెరుగుతుంది. స్థూలకాయాన్ని కొలవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎంఐ) అనే కొలమానం ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే... ఒకరి బరువును కిలోల్లో తీసుకుని, దాన్ని ఆ వ్యక్తి తాలూకు ఎత్తును మీటర్లలో తీసుకుని దాన్ని రెట్టింపు చేసి భాగించడం. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 70 కిలోలు, ఎత్తు 1.7 మీటర్లు అనుకోండి. అప్పుడతడి బీఎంఐ = 70 కిలోలు / 1.7 మీ.x 1.7 మీ. ఇలా వచ్చిన కొలతను ఈకింద ఉన్న ప్రమాణాలతో పోల్చి చూసి, అతడు స్థూలకాయుడా, కాదా అన్నది నిర్ణయిస్తారు. ఈ ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించింది. పై విధంగా వేసిన లెక్కలో వచ్చిన విలువను బట్టి ఓ వ్యక్తి ఏ మేరకు స్థూలకాయుడు అన్నది నిర్ణయిస్తారు. ఇది ఇలా... వర్గీకరణ బీఎంఐ (కిలోలు / మీ. స్క్వేర్) ------------------------------------------------------- తక్కువ బరువు 18.5 కంటే తక్కువ సాధారణ బరువు 18.5 నుంచి 22.9 వరకు అధిక బరువు 23 నుంచి 24.9 వరకు స్థూలకాయానికి ముందు 25 నుంచి 29.9 వరకు ఒబేస్ క్లాస్ 1 30.0 నుంచి 34.9 వరకు ఒబేస్ క్లాస్ 2 35.0 నుంచి 39.9 వరకు ఒబేస్ క్లాస్ 3 40 కంటే ఎక్కువ ------------------------------------------------------ స్థూలకాయానికి కారణాలు జన్యుపరమైనవి : కొందరిలో జన్యుపరమైన కారణాలతో హార్మోన్ల పనితీరు అధికమై అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీలను తీసుకుంటుంది.. ఈ క్యాలరీల వల్ల కొవ్వు పేరుకుపోవచ్చు. తగినంత శారీరక శ్రమ లేకపోవడం : తగినంత శరీరక శ్రమ లేపోవడం వల్ల శరీరం తగినన్ని క్యాలరీలను కోల్పోక వాటిని నిత్యం నిల్వ చేసుకోవడం జరుగుతుంటుంది. దీనివల్ల స్థూలకాయం పెరుగుతుంది. అనారోగ్యకరమైన తినే అలవాట్లు : ఈ రోజుల్లో మనలో చాలామంది అత్యధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని రాత్రి వేళల్లో తీసుకోవడం, అత్యధిక క్యాలరీలు ఉన్న పానీయాలను తాగడం వల్ల బరువు పెరుగుతున్నారు. మహిళల విషయంలో గర్భధారణ కూడా : గర్భధారణ జరిగిన మహిళ కొద్దిగా బరువు పెరగడం సాధారణం. అయితే కొందరు బిడ్డ పుట్టాక కూడా తాము పెరిగిన బరువును కోల్పోరు. ఇది అనర్థాలకు కారణం కావచ్చు. నిద్రలేమి : సాధారణంగా ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో హార్మోన్లలో మార్పులు వచ్చి వారి ఆకలి తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తాయి. దీనివల్ల వారు కార్బోహైడ్రేట్ ఆహారాలకు అలవాటు పడి, క్రమంగా అది బరువు పెరగడానికి దోహదం చేస్తుంటుంది. కొన్ని రకాల మందులు : యాంటీడిప్రెసెంట్ మందులు, ఫిట్స్ మందులు, డయాబెటిస్ నియంత్రణకు వాడే మందులు, మానసిక వ్యాధులకు వాడే మందులు, స్టెరాయిడ్స్, బీటాబ్లాకర్స్ స్థూలకాయానికి దారితీయవచ్చు. కొన్ని రకాల వ్యాధులు : ఒక్కోసారి కొన్ని రకాల వ్యాధులు కూడా స్థూలకాయానికి కారణం కావచ్చు. ఉదాహరణకు ప్రెడర్-విల్లీ సిండ్రోమ్, కుషింగ్స్ సిండ్రోమ్, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వంటి వ్యాధుల్లో అది స్థూలకాయానికి దారితీయవచ్చు. బరువు తగ్గడానికి అనువైన మార్గాలు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. అవి... ఆరోగ్యకరమైన జీవన శైలి : మనం నిత్యజీవితంలో ఆచరించే ఆహార, వ్యాయామ విధానాల ద్వారానే బరువు తగ్గే ప్రణాళికలు రూపొందించుకోవడం. వాటిని ఆచరిస్తూ మన మీద మనకు ఉన్న నమ్మకంతో ‘మనం చేయగలం’ అనుకుంటూ బరువు తగ్గడం. మందులతో/వైద్య ప్రక్రియలతో... ఆరోగ్యకరమైన రీతిలో మనం రోజూ అనుసరించే మామూలు మార్గాల్లోనే అధిక బరువు సమస్యను అధిగమించకపోతే... ఒక్కోసారి పేషెంట్ కండిషన్‌ను బట్టి మందులు, డాక్టర్ల సాయంతో బరువును నియంత్రించాల్సి ఉంటుంది. అది రెండు రకాలుగా జరగవచ్చు. అవి... 1. అధిక బరువు తగ్గడానికి అవసరమైన వైద్య విధానాలు ఆచరించడం / మందులను వాడటం 2. స్థూలకాయం వల్ల వచ్చిన ఆరోగ్యసమస్యలకు మందులు వాడటం. అధిక బరువు / స్థూలకాయం ఉన్నవారికి వైద్యపరమైన జాగ్రత్తలతో మందులు వాడుతున్నప్పుడు వైద్యప్రక్రియ మూడు రకాలుగా ఉంటుంది. అది... అధికబరువు / స్థూలకాయం ద్వారా వచ్చిన ఆరోగ్య సమస్యను తగ్గించేందుకు మందులు వాడటం. ఆ సమస్యను అధిగమించే రీతిలో రోగి ఆహారంలో మార్పులు చేస్తూ, రోగికి తగినంత శారీరక శ్రమ ఉండేలా వ్యాయామాలను నిర్ణయించడం. ఏవైనా తినడానికి సంబంధించిన సమస్య (ఈటింగ్ డిజార్డర్) ఉంటే దాన్ని తగ్గించడానికి అవసరమైన మందులు వాడటం. ఇలా ఈ మూడు మార్గాలను కలగలపిన ఆరోగ్య ప్రణాళిక ద్వారా పేషెంట్ బరువును నియంత్రిస్తూ ఉండటం వంటివి చేస్తారు. స్థూలకాయాన్ని తగ్గించడానికి అవసరమైన శస్త్రచికిత్స మార్గాలు : స్థూలకాయం వల్ల కలిగే అనర్థాలు ఒక్కోసారి రోగికి ప్రాణాపాయానికి దారితీసేలా ఉంటే అప్పుడు సంప్రదాయ విధానాల ద్వారా బరువు తగ్గించడానికి బదులు డాక్టర్లు శస్త్రచికిత్స ప్రక్రియలను అనుసరించడానికి మొగ్గుచూపువచ్చు. అయితే ఇది అందరి విషయంలోనూ జరగదు. ఇలా ఒక లావుగా ఉన్న వ్యక్తి బరువు తగ్గించడానికి శస్త్రచికిత్సను సూచించడం కొన్ని పరిస్థితుల్లోనే జరుగుతుంది. ఆ పరిస్థితులేమిటంటే... రోగి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 40 కంటే ఎక్కువగా ఉండటం. ఒక వ్యక్తి ఉండాల్సిన ఆరోగ్యకరమైన బరువు కంటే... రోగి పురుషుడైతే అతడి బరువు 45 కిలోల కంటే ఎక్కువ ఉండటం / అదే స్త్రీ అయితే ఆమె బరువు సాధారణ బరువు కంటే 35 కిలోలు అధికంగా ఉండటం. ఒక వ్యక్తికి తన బీఎంఐ విలువ 35 - 40 మధ్యన ఉంటే అతడికి స్థూలకాయం వల్ల వచ్చే అనర్థాలైన టైప్-2 డయాబెటిస్, నిద్రలో గురకపెట్టడం (స్లీప్ ఆప్నియా), గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు కలిగి ఉండటం. స్థూలకాయం వల్ల రోగికి ప్రాణాపాయం ఉంటే... అతడి స్థూలకాయాన్ని తగ్గించేందుకు చేసే శస్త్రచికిత్స వల్ల అతడికి, బరువు పెరగడం వల్ల వచ్చే ఇతర సమస్యలనుంచే కొంత ఉపశమనం కలగవచ్చు. అవి... రక్తంలోని చక్కెర పాళ్లు తగ్గించడం, రక్తపోటును నియంత్రించడం, గురకను తగ్గించడం, గుండెపై పడే అదనపు ఒత్తిడిని తగ్గించడం, రక్తంలోని ఒక రకం కొవ్వులైన కొలెస్ట్రాల్ పాళ్లనూ తగ్గించడం వంటివి. అయితే అంతమాత్రాన ప్రాణాపాయం కలిగించేటంతగా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ప్రతి సందర్భంలోనూ శస్త్రచికిత్స ఒక్కటే మార్గం కాకపోవచ్చు. రోగి వ్యక్తిగత పరిస్థితితో పాటు అనేక అంశాలను గమనించి ఈ తరహా శస్త్రచికిత్సను చేయాల్సి ఉంటుంది. రోగి బరువు తగ్గించడానికి చేసే శస్త్రచికిత్సను ‘బేరియాట్రిక్ సర్జరీ’ అంటారు. ఇలా చేసే శస్త్రచికిత్సలు మూడు రకాలుగా ఉంటాయి. అవి... 1. మాల్ అబ్సార్ప్టివ్ 2. రెస్ట్రిక్టివ్ 3. పై రెండు అంశాలనూ కలగలిపిన శస్త్రచికిత్సలు. 1. మాల్ ఆబ్సార్ప్టివ్ తరహా శస్త్రచికిత్స : ఈ తరహా శస్త్రచికిత్స వల్ల రెస్ట్రిక్టివ్ తరహా కంటే ఎక్కువగా బరువు తగ్గుతారు. ఈ తరహా శస్త్రచికిత్సలో భోజనం స్వతహాగా జీర్ణమయ్యే మార్గం నుంచి ఆ ఆహారాన్ని ఇతర మార్గానికి మళ్లిస్తారు. అందువల్ల ఆహారం జీర్ణమయ్యే క్రమంలో కడుపు, చిన్నపేగుల్లోని మార్గంలో చాలా తక్కువగా ప్రయాణిస్తుంది. అందుకే ఈ తరహా చికిత్సను ‘‘గ్యాస్ట్రిక్ బైపాస్’’ అని కూడా వ్యవహరిస్తారు. 2. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ : ఇందులో ఆహారం ప్రయణించే మార్గాన్ని బై-పాస్ చేయకుండా పేగుల్లో జీర్ణమయ్యే ఆహారపు మార్గాన్ని శస్త్రచికిత్స మార్గాల ద్వారా కుదిస్తారు. ఉదా: కడుపు సైజును గణనీయంగా తగ్గించడం. దీని వల్ల కడుపులో పట్టే ఆహారపు పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. దీన్నే ‘స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ’ ప్రక్రియ అంటారు. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్లు ఎంతో కొంత మేరకు కడుపు కుదించడం జరుగుతుంది కాబట్టి బేరియాట్రిక్ సర్జరీలలోని ఈ ప్రక్రియ అన్నిట్లోనూ ఎక్కువగా చోటుచేసుకుంటుంది. అదే మెటబాలిక్ తరహా సిండ్రోమ్‌లు ఉన్నవారి పరిస్థితిని మెరుగుపరచడానికి మాల్ అబ్సార్ప్టివ్ ప్రొసీజర్లను అనుసరిస్తూ ఉంటారు. రకరకాల గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్సలు రూక్స్ ఎన్-వై గ్యాస్ట్రిక్ బైపాస్ (ఆర్జీబీ) : ఇది గ్యాస్ట్రిక్ బై-పాస్ ప్రక్రియలన్నింటిలోనూ చాలా సాధారణంగా చేసే శస్త్రచికిత్స. ఇందులో రెస్ట్రిక్టివ్, మాల్అబ్సార్ప్టివ్... కలగలసి ఉంటాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత రోగి తన బరువులో మూడింట రెండు వంతుల బరువును తగ్గించవచ్చు. ఈ శస్త్రచికిత్స ప్రక్రియతో ఆహారాన్ని అన్నవాహిక నుంచి స్టమక్‌లోకి కాకుండా నేరుగా పేగులకు వెళ్లేలా కలుపుతారు. అంటే... అన్నకోశాన్ని (స్టమక్‌ని) బై-పాస్ చేస్తూ నేరుగా అన్నవాహికను పేగులతో అనుసంధానిస్తారు. అన్నవాహిక దగ్గర ఒక చిన్న సంచి రూపొందేలా ఈ సర్జరీ చేస్తారు. మళ్లీ ఈ సంచి నుంచి పేగుల్లోకి ఆహారం వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో చిన్నపేగుల ఆకృతి ‘వై’ అక్షరంలా ఉంటుంది. ఇలా చేసే శస్త్ర చికిత్సలో జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని మొదటి భాగమైన ‘డియోడినమ్’లోకి కాకుండా నేరుగా రెండో భాగమైన జిజినమ్ అనే చోట పేగుల్లోకి ప్రవేశిస్తుంది. దాంతో జీర్ణమయ్యే భాగాల్లో ఆహారం ఇంకకుండా పోతుంది. ఫలితంగా ఆహారంలోని అదనపు క్యాలరీలు శరీరంలోకి రావు. గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్స వల్ల వచ్చే రిస్క్‌లు అయితే గ్యాస్ట్రిక్ బైపాస్ వల్ల కొన్ని రిస్క్‌లు కూడా ఉంటాయి. ఆహారం జీర్ణమయ్యే నిడివిని తగ్గించడం వల్ల తగినంత ఆహారం, పోషకాలు రక్తంలోకి ఇంకవు. ఫలితంగా అనీమియా (రక్తహీనత) రావచ్చు. అంతేకాదు... కీలకమైన ఐరన్, విటమిన్ బి12 వంటివి శరీరానికి తగినంతగా అందకపోవచ్చు. ఫలితంగా ఒక్కోసారి ఈ శస్త్రచికిత్స తర్వాత ఆస్టియోపోరోసిస్ వంటి పరిస్థితులూ రావచ్చు. డంపింగ్ సిండ్రోమ్ అనే మరో కండిషన్ కూడా వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రొసిజర్ ఇది. ఇందులో రోగికి వికారం, చెమటలు పట్టడం, స్పృహతప్పిపడిపోవడం, బలహీనంగా మారడం, నీళ్లవిరేచనాలు కావడం వంటివి కనిపిస్తాయి. ఇలాంటి రిస్క్‌లు ఉన్నప్పుడు మరో అదనపు శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ : ఈ ప్రక్రియలో కడుపును మూడింట రెండు వంతుల కుదిస్తారు. సంచి లాంటి కడుపు భాగాన్ని ఒక అరటిపండు ఆకృతికి పరిమితమయ్యేలా తగ్గిస్తారు. ఒకసారి ఈ ప్రక్రియను అనుసరిస్తే మళ్లీ కోల్పోయిన కడుపు భాగాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఈ ప్రక్రియ తర్వాత స్థూలకాయంతో బాధపడే రోగి 6 నుంచి 12 నెలల వ్యవధిలోనే తన బరువులో 70 శాతాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉంది. ఇంతగా కడుపును కుదించడం వల్ల... ఆహారాన్ని చాలా చిన్న మోతాదుకు తగ్గించాల్సి ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీపై అపోహలు బరువును తగ్గించడానికి చేసే బేరియాట్రిక్ సర్జరీలపై ప్రజల్లో ఎన్నో అపోహలూ... వివాదాలూ ఉన్నాయి. వాటిలో మొదటిది... బరువును తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని సులభమైన మందులు ఉండగా రోగికి శస్త్రచికిత్స అనవసరం. కానీ వాస్తవం ఏమిటంటే... రోగి బరువును ఠక్కున తగ్గించే మ్యాజిక్ మందు అంటూ ఏదీ లేదు. ఇలా ఉందని ఎవరైనా చెప్పినా నమ్మవద్దు. రెండో అపోహ : బేరియాట్రిక్ సర్జరీ తర్వాత రోగికి చాలా రకాల సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఈ తరహా సర్జరీ మృత్యువుకూ దారి తీయవచ్చు. అయితే ఇది పూర్తిగా తప్పు. నిజానికి సర్జరీ చేయకపోవడం వల్లనే అతడి బరువు అతడిని కబళించే పరిస్థితుల్లోనే డాక్టర్లు రోగులకు ఈ తరహా సర్జరీలను సిఫార్సు చేస్తారు. మూడో అపోహ : బేరియాట్రిక్ సర్జరీ తర్వాత రోగి తన మామూలు ఆహారాన్ని తీసుకోలేడు. వాస్తవం ఏమిటంటే... సర్జరీ తర్వాత కూడా రోగి తన సాధారణ ఆహారాన్నే తీసుకుంటూ ఉంటాడు. కాకపోతే తక్కువ మోతాదుల్లో డాక్టర్లు సూచించిన విధంగా. తక్షణ ప్రాణాపాయ ప్రమాదం ఉన్న రోగులు మినహా మిగతా వారు ఆరోగ్యకరమైన జీవనశైలి మార్గాలతో బరువు తగ్గడం ఎంతో మేలు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన ఆహారం... శస్త్రచికిత్స తర్వాత రోగి ఘనాహారం తీసుకోవడం ప్రారంభించాక... ఆహారాన్ని బాగా, చాలాసేపు, నింపాదిగా నమిలాకే మింగాలి. ఎందుకంటే కడుపులో ఆహారం జీర్ణమయ్యే పరిస్థితిని శస్త్రచికిత్స ద్వారా తగ్గిస్తారు కాబట్టే ఈ జాగ్రత్త. ఆహారం తీసుకునే సమయంలో ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవద్దు. ఇలా చేస్తే ఒక్కోసారి అది వెంటనే వాంతి అయ్యేందుకు దోహదపడవచ్చు. లేదా డంపింగ్ సిండ్రోమ్‌కు దారితీయవచ్చు / తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా అనిపించవచ్చు. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, అన్నం తర్వాత తీసుకునే పాయసం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవద్దు. చాలా కొద్ది పరిమాణంలోనే వాటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్ లేదా హైక్యాలరీ సప్లిమెంట్స్ ఉండే పానీయాలు, మిల్క్‌షేక్‌లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను పూర్తిగా మానేయాలి. మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి. ఆహారానికి, ఆహారానికి మధ్య తీసుకునే చిరుతిండ్లను గణనీయంగా తగ్గించాలి. స్థూలకాయం వల్ల అనర్థాలు స్థూలకాయం ఒక పరిమితికి మించి పెరిగితే, దాని వల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి. నడుస్తున్నప్పుడు తమ భారాన్ని తమ శరీరమే భరించలేకపోవచ్చు. తమ శరీర బరువు వల్ల సరిగా శ్వాసతీసుకోలేకపోవచ్చు. స్థూలకాయం డయాబెటిస్, అధిక రక్తపోటు, స్లీప్ ఆప్నియా, గుండెజబ్బులు, గాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), గాల్‌స్టోన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు కారణం కావచ్చు. బేరియా ట్రిక్ శస్త్రచికిత్స తర్వాత జీవితంఎలా ఉంటుంది? మన జీవనంలోని నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడానికే ఈ తరహా శస్త్రచికిత్సలు. ఒంటి బరువు తగ్గడం వల్ల రోగి కదలికలు చురుగ్గా ఉండటం, ఆరోగ్యకరంగా అనిపించడం చాలా సాధారణం. అయితే రోగి కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం. -
భిన్న సంఖ్యను కనుక్కోవాలంటే?
భిన్న పరీక్ష (క్లాసిఫికేషన్) ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలలో మూడు లేదా నాలుగు ప్రశ్నలు భిన్న పరీక్ష నుంచి వస్తున్నాయి. దీన్నే క్లాసిఫికేషన్ లేదా ఆడ్‌మన్ ఔట్ అని కూడా అంటారు. దీన్ని రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అవి 1. సంఖ్యల ఆధారిత భిన్న పరీక్ష 2. పదాల ఆధారిత భిన్న పరీక్ష ఈ సంచికలో సంఖ్యల ఆధారిత భిన్న పరీక్ష గురించి తెలుసుకుందాం. నంబర్ క్లాసిఫికేషన్ (లేదా)నంబర్ ఆడ్‌మన్ ఔట్ ఇందులో నాలుగు సంఖ్యలు ఇచ్చి, అందులో భిన్నమైన సంఖ్య ఏదని అడుగుతారు. ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో ఒక సంఖ్య మినహా మిగిలిన సంఖ్యలన్నీ ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఆ కుటుంబానికి చెందని భిన్నమైన సంఖ్యను కనుక్కోవాలి. భిన్న సంఖ్యను కనుక్కోవడానికి కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. 1.సరిసంఖ్యలు, బేసి సంఖ్యలు ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సరిసంఖ్యలు, ఒక బేసి సంఖ్య ఉండొచ్చు. లేదా మూడు బేసి సంఖ్యలు, ఒక సరి సంఖ్య ఉండొచ్చు. 2.ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో ఒకట్ల స్థానంలోని అంకెను పరిశీలించడం. దీని ఆధారంగా 2, 5, 10 గుణిజాలను బట్టి సమాధానం కనుక్కోవచ్చు. ఇలా జవాబు కనుక్కోవడం సాధ్యం కాకపోతే తర్వాత పద్ధతి పరిశీలించాలి. 3.ఇచ్చిన సంఖ్యల్లో చివరి రెండు లేదా మూడు అంకెలను పరిశీలించాలి. దీనిఆధారంగా 4, 8 గుణిజాల బట్టి సమాధానం కనుక్కోవచ్చు. 4.ఇచ్చిన సంఖ్యల్లోని అంకెల మొత్తం కనుక్కోవాలి. దీనివల్ల 3, 9 గుణిజాల ఆధారంగా సమాధానం కనుక్కోవచ్చు. 5.6, 7, 11 గుణిజాల ఆధారంగా జవాబు కనుక్కునే ప్రయత్నం చేయాలి. 6.ప్రధాన సంఖ్యలు, వర్గ సంఖ్యలు, ఘన సంఖ్యల ఆధారంగా జవాబు కనుక్కునే ప్రయత్నం చేయాలి. పై ఆరు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి ప్రకారం సమాధానం కనుక్కోవచ్చు. నంబర్ క్లాసిఫికేషన్‌లో ఉన్న ప్రతి ప్రశ్నకు పైన చెప్పిన ఆరు పద్ధతులను అదే వరుసక్రమంలో పరిశీలించాల్సిన అవసరం లేదు. ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు వర్గ సంఖ్యలుండి, ఒకటి వర్గ సంఖ్య కాకుంటే నేరుగా చివరి పద్ధతి ప్రకారం సమాధానం కనుక్కోవచ్చు. ఉదాహరణలు కింద ఇచ్చిన సంఖ్యల్లో భిన్నంగా ఉన్న దాన్ని కనుక్కోండి? 1. 1) 24 2) 54 3) 75 4) 84 పై నాలుగు సంఖ్యల్లో 75 తప్ప మిగిలినవన్నీ సరిసంఖ్యలు. 75 మాత్రమే సరిసంఖ్యల కుటుంబానికి చెందదు. జవాబు 3 2. 1) 21 2) 24 3) 42 4) 54 21 మినహా మిగిలినవన్నీ సరిసంఖ్యలు జవాబు 1 3. 1) 2384 2) 4792 3) 6976 4) 8962 పైన ఇచ్చిన నాలుగు సంఖ్యలన్నీ సరిసంఖ్యలే. కానీ 8962 మినహా మిగిలిన సంఖ్యలన్నీ 4తో నిశ్శేషంగా భాగితమవుతాయి. జవాబు 4 4. 1) 11 2) 13 3) 15 4) 17 15 మినహా మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు జవాబు 3 5. 1) 43 2) 53 3) 63 4) 73 63 మినహా మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు జవాబు 3 6. 1) 49 2) 77 3) 81 4) 91 ఇందులో అన్ని సంఖ్యలు బేసి సంఖ్యలు. కాబట్టి బేసి సంఖ్యల ఆధారంగా సమాధానం కనుక్కోలేం. 49, 81లు వర్గ సంఖ్యలు, 77, 91లు వర్గ సంఖ్యలు కావు. ఈ కోణంలో కూడా సమాధానం కనుక్కోలేం. కానీ 81 మినహా మిగిలిన సంఖ్యలన్నీ 7తో నిశ్శేషంగా భాగితమవుతాయి. జవాబు 3 7. 1) 144 2) 196 3) 256 4) 334 334 మినహా మిగిలినవన్నీ కచ్చితమైన వర్గ సంఖ్యలు 144 = 122; 196 = 142; 256 = 162 జవాబు 4 8. 1) 2151 2) 7911 3) 9873 4) 5469 పైన ఇచ్చిన నాలుగు సంఖ్యలు బేసి సంఖ్యలు, ప్రతి సంఖ్య 3తో నిశ్శేషంగా భాగితమవుతుంది. కానీ 5469 మినహా మిగిలిన సంఖ్యలన్నీ ‘9’తో నిశ్శేషంగా భాగితమవుతాయి. జవాబు 4 9. 1) 289 2) 361 3) 441 4) 529 289 = 172; 361 = 192; 441 = 212; 529 = 232 441 తప్ప మిగిలివన్నీ ప్రధాన సంఖ్యల వర్గాలు జవాబు 3 10. 1) 20 2) 30 3) 70 4) 90 20 = 42 + 4 30 = 52 + 5 90 = 92+ 9 70 తప్ప మిగిలిన సంఖ్యలన్నీ ్ఠ2 + ్ఠ రూపంలో ఉన్నాయి. జవాబు 3 11. 1) 10 2) 20 3) 30 4) 130 10 = 23 + 2 30 = 33 + 3 130 = 53 + 5 20 తప్ప మిగిలిన సంఖ్యలన్నీ ్ఠ3 + ్ఠ రూపంలో ఉన్నాయి. జవాబు 2 12. 1) 100 2) 200 3) 400 4) 900 100 = 102 400 = 202 900 = 302 200 తప్ప మిగిలిన సంఖ్యలన్నీ కచ్చితమైన వర్గ సంఖ్యలు జవాబు 2 13. 1) 1000 2) 8000 3) 27000 4) 68000 1000 = 103 8000 = 203 27000 = 303 68000 మినహా మిగిలినవన్నీ కచ్చితమైన ఘనాలు. జవాబు 4 14. 1) 3, 5, 11, 19 2) 5, 7, 9, 11 3) 11, 13, 17, 19 4) 17, 19, 23, 29 పతి ఆప్షన్లో నాలుగు సంఖ్యలు ఉన్నాయి. ఆప్షన్ 2లో గల ‘9’ తప్ప మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు. జవాబు 2 15. 1) 22 - 33 2) 77 - 88 3) 33 - 44 4) 11 - 22 పతి ఆప్షన్లో రెండు సంఖ్యలు ఉన్నాయి. అవన్నీ 11తో నిశ్శేషంగా భాగితమవుతాయి. వాటి మధ్య వ్యత్యాసం సమానంగా ఉంది. కానీ ఆప్షన్ 1లో మినహా మిగిలిన మూడు ఆప్షన్లలో మొదటి సంఖ్య బేసి, రెండో సంఖ్య సరి. జవాబు 1 16. 1) 1 2) 64 3) 729 4) 1296 1 = 12 = 13 = 16 64 = 82 = 43 = 26 729 = 272 = 93 = 36 1296 = 362 1296 తప్ప మిగిలిన సంఖ్యలన్నీరూపంలో రాయగలం. జవాబు 4 గత పరీక్షల్లో ప్రశ్నలు 1. 1) 12 2) 18 3) 9 4) 7 7 మినహా మిగిలినవన్నీ సంయుక్త సంఖ్యలు జవాబు 4 2. 1) 51 2) 144 3) 64 4) 121 51 మినహా మిగిలినవన్నీ కచ్చితమైన వర్గాలు జవాబు 1 3. 1) 232 2) 431 3) 612 4) 813 813లో మినహా మిగిలిన సంఖ్యల్లోని అంకెల లబ్ధం 12కు సమానం. జవాబు 4 4. 1) 10 2) 11 3) 15 4) 16 11 మినహా మిగిలిన సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు జవాబు 2 5. 1) 2345 2) 3456 3) 5467 4) 5678 5467లో మినహా మిగిలిన సంఖ్యల్లోని అంకెలన్నీ ఒక వరుసక్రమంలో వచ్చాయి. జవాబు 3 6. 1) 9611 2) 7324 3) 2690 4) 1754 7324 సంఖ్య మినహా మిగిలిన అన్ని సంఖ్యల్లోని అంకెల మొత్తం 17కు సమానం. జవాబు 2 ఈ నంబర్ క్లాసిఫికేషన్లోని ప్రశ్నలు సులువుగా, వేగంగా చేయాలంటే కింది అంశాలపై పట్టు సాధించాలి. 1. వివిధ రకాల సంఖ్యలపై అవగాహన 2. 11 వరకు భాజనీయత సూత్రాలు 3. 35 వరకు వర్గాలు 4. 15 వరకు ఘనాలు 5. 20 వరకు ఎక్కాలు (టేబుల్స్) 6. 100లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు. 7. కూడిక, తీసివేత, గుణకార, భాగహారాలు వేగంగా చేయగలగాలి.