ఎస్సీ వర్గీకరణ కోసం ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం అనడం సిగ్గు చేటని అసలు ఎస్సీ వర్గీకరణ చట్ట విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని తెల్చి చెప్పిన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఎస్సీలను పావుగా వాడుకుంటున్నాయని తెలంగాణ నేతకాని (మహార్) రిజర్వేషన్ పొరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోత్తపల్లి మహేందర్ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ చట్టవిరుద్ధం
Aug 12 2016 12:03 AM | Updated on Sep 4 2017 8:52 AM
ఉట్నూర్ : ఎస్సీ వర్గీకరణ కోసం ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం అనడం సిగ్గు చేటని అసలు ఎస్సీ వర్గీకరణ చట్ట విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని తెల్చి చెప్పిన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఎస్సీలను పావుగా వాడుకుంటున్నాయని తెలంగాణ నేతకాని (మహార్) రిజర్వేషన్ పొరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోత్తపల్లి మహేందర్ అన్నారు.
గురువారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దిష్టి బోమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని వెంటనే ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నేతకాని (మహార్) రిజర్వేషన్ పొరాట సమితి మండల అధ్యక్షుడు దూట మహేందర్, జిల్లా కార్యదర్శి కాంబ్లే రవికాంత్, నాయకులు కేశవ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement