హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ! | Btech student Haindavi murder case mystery solved by Police | Sakshi
Sakshi News home page

హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ!

Jul 22 2017 3:34 PM | Updated on Jul 30 2018 8:37 PM

హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ! - Sakshi

హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ!

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని కడపన హైందవి కేసు మిస్టరీ వీడింది.

ప్రొద్దుటూరు : వైఎస్‌ఆర్‌ జిల్లా  ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన  బీటెక్‌ విద్యార్థిని కడపన హైందవి కేసు మిస్టరీ వీడింది. గతంలో హైందవి ఇంట్లో అద్దెకు ఉన్న నవీన్‌ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు హైందవి మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైందవి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని నవీన్‌ గమనించారు.

దాంతో శుక్రవారం మధ్యాహ్నం వాళ్లింటికి వచ్చిన అతడు...హైందవిపై అత్యాచారయత్నం చేశారు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు, తన గుట్టు బయటపడుతుందనే భయంతో నవీన్‌ ...ఆమెను దారుణంగా హతమార్చాడు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు దోపిడీ దొంగలే ఈ ఘటనకు పాల్పడినట్లు హైందవి వంటిపై బంగారు ఆభరణాలతో పాటు, స్కూటీతో పరారయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement