పెళ్లి కొడుకు అదృశ్యం | bridegroom missing | Sakshi
Sakshi News home page

పెళ్లి కొడుకు అదృశ్యం

Jun 5 2017 11:22 PM | Updated on Sep 5 2017 12:53 PM

కర్నూలులోని సంతోష్‌నగర్‌కు చెందిన పందిళ్ల పెద్ద వెంకటేశ్వర్లు(25) ఐదు రోజులుగా కనిపించడంలేదని ఆయన సోదరి ఎస్‌.లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు నాలుగో పట్టణ పోలీసులు సోమవారం తెలిపారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలులోని సంతోష్‌నగర్‌కు చెందిన పందిళ్ల పెద్ద వెంకటేశ్వర్లు(25) ఐదు రోజులుగా కనిపించడంలేదని ఆయన సోదరి ఎస్‌.లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు నాలుగో పట్టణ పోలీసులు సోమవారం తెలిపారు. పూర్తి వివరాలు.. తాండ్రపాడు సమీపంలోని శ్రీచైతన్య పాఠశాలలో పెద్ద వెంకటేశ్వర్లు టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన పెళ్లి నిశ్చయం అయింది. ఈనెల ఒకటో తేదీన స్నేహితులు, బంధువులకు కార్డులు పంచేందుకు వెళ్లాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం తండ్రి పి.పెద్ద అంకయ్య, సోదరి ఎస్‌.లక్ష్మిదేవి వేర్వేరు ప్రాంతాల్లో వెతికారు. అయినా జాడ కనిపించకపోవడంతో సోమవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement