బ్రేక్‌ఇన్‌స్పెక్టర్‌ అరెస్టు | break inspector areest | Sakshi
Sakshi News home page

బ్రేక్‌ఇన్‌స్పెక్టర్‌ అరెస్టు

Sep 2 2016 12:21 AM | Updated on Sep 4 2017 11:52 AM

ఏసీబీ దాడుల్లో పట్టుబడిన బ్రేక్‌ఇన్‌స్పెక్టర్‌ రావు అప్పారావును అరెస్టు చేశారు. కాకినాడ డీటీసీ కార్యాలయంలో బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చే

కాకినాడ రూరల్‌ : ఏసీబీ దాడుల్లో పట్టుబడిన బ్రేక్‌ఇన్‌స్పెక్టర్‌ రావు అప్పారావును అరెస్టు చేశారు. కాకినాడ డీటీసీ కార్యాలయంలో బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న రావు అప్పారావు ఇంటిపైన, అతని స్నేహితులు, బంధువుల ఇళ్లపైన గురువారం రెండోరోజు కూడా ఏసీబీ అధికారులు దాడులు కొనసాగాయి. అతని డ్రైవర్‌ శ్రీనివాస్, బినామీగా ఉన్న బొడ్డు రామారావు, సత్యనారాయణలను వారి వారి ఇళ్ల వద్దే ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఈ దాడుల్లో పట్టుబడిన పలు పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు, బంగారు, డబ్బు సీజ్‌ చేసి అప్పారావును అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. అప్పారావును విజయవాడ కోర్టుకు తరలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో తాము పరిశీలించిన వడ్డీలకు ఇచ్చిన అప్పులు రూ. 2 కోట్లు పైబడి ఉన్నాయన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement