డెంగీతో బాలుడి మృతి | boy died with dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో బాలుడి మృతి

Sep 6 2016 11:14 PM | Updated on Sep 28 2018 3:41 PM

నకిరేకల్‌ : డెంగీతో మూడున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. నకిరేకల్‌లోని వీటీ కాలనీలో నివాసం ఉంటున్న కందగట్ల సందీప్, దివ్యల మూడున్నరేళ్ల బాలుడు శాన్వికి మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది.

నకిరేకల్‌ : డెంగీతో మూడున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. నకిరేకల్‌లోని వీటీ కాలనీలో నివాసం ఉంటున్న కందగట్ల సందీప్, దివ్యల మూడున్నరేళ్ల బాలుడు శాన్వికి మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. డెంగీగా అనుమానంతో హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉన్న బేబి వైద్యశాలలో చేర్పించారు. పల్స్‌ పడిపోవడంతో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. డెంగీతో మృతిచెందాడని డాక్టర్‌ తెలిపినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. మంగళవారం శాన్వి మృతదేహాన్ని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులు సందర్శించి సంతాపాన్ని వ్యక్తం చేశారు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement