మండలంలోని నర్సాపూర్(జి) గ్రామంలో ఆదివారం సాయంత్రం నీటి కుండీలో పడి ధర్మోల్ల యోగేశ్(3) మతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి.
-
నర్సాపూర్(జి)లో విషాదం
దిలావర్‌పూర్ : మండలంలోని నర్సాపూర్(జి) గ్రామంలో ఆదివారం సాయంత్రం నీటి కుండీలో పడి ధర్మోల్ల యోగేశ్(3) మతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శ్రీనివాస్, సాయవ్వ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు యోగేశ్. ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలోనే ఉన్న నీటి కుండీలో పడ్డాడు. నీట మునగడంతో ఊపిరాడక మత్యువాతపడ్డాడు. గమనించిన అతడి తల్లి సాయవ్వ, స్థానికులు కలిసి ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే బాలుడు మతిచెందాడు. మూడేళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ కుటుంబసభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. నర్సాపూర్(జి) పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.