చెక్‌డ్యాంలో పడి బాలుడి మృతి | boy dead in checkdam | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యాంలో పడి బాలుడి మృతి

Jul 20 2016 10:55 PM | Updated on Jul 12 2019 3:02 PM

మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన శేక్‌ సాదిక్‌(10) ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఎస్సై మారుతి కథనం ప్రకారం.. గూడూరు ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న సాదిక్‌ సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి గ్రామ శివారులోని చెక్‌డ్యామ్‌లోకి ఈతకు వెళ్లాడు.

ముస్తాబాద్‌: మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన శేక్‌ సాదిక్‌(10) ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఎస్సై మారుతి కథనం  ప్రకారం.. గూడూరు ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న సాదిక్‌ సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి గ్రామ శివారులోని చెక్‌డ్యామ్‌లోకి ఈతకు వెళ్లాడు. చెక్‌డ్యామ్‌లో నీరు ఎక్కువగా ఉండగా సాదిక్‌ నీటిలో మునిగి మృతి చెందాడు. సాదిక్‌ కోసం కుటుంబీకులు రాత్రి వెతకగా.. చెక్‌డ్యామ్‌ గట్టున సాదిక్‌ బట్టలు, సైకిల్‌ఉండడంతో అందులో గాలించారు. సాదిక్‌ మృత దేహం లభ్యకావడంతో వారి రోదనలు మిన్నంటాయి. తండ్రి హైదర్‌ ఉపాధి కోసం మధ్యప్రదేశ్‌ వెళ్లగా.. తల్లి జుబెదా గూడూరులో ఉంటూ సాదిక్‌ను చదివిస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement