ప్రేమ విఫలం.. ప్రియుడు ఆత్మహత్య | boy commit to sucide about he's lover sucide one week before | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలం.. ప్రియుడు ఆత్మహత్య

Apr 13 2016 3:18 AM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రేమ విఫలం.. ప్రియుడు ఆత్మహత్య - Sakshi

ప్రేమ విఫలం.. ప్రియుడు ఆత్మహత్య

ప్రేమించిన యువతి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపంతో ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంగళవారం పాలమాకులలో జరిగింది.

రెండు రోజుల కిందటే యువతి బలవన్మరణం
నంగునూరు: ప్రేమించిన యువతి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపంతో ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంగళవారం పాలమాకులలో జరిగింది. ఎస్‌ఐ గోపాల్‌రావు, బంధువుల కథనం మేరకు.. చిన్నకోడూర్ మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన పరమాండ్ల బాలకిషన్(22), అదే గ్రామానికి చెందిన గీత.. సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు.

ఇటీవలే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే, విషయం తెలుసుకున్న గీత తల్లిదండ్రులు ఆమెను కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని బంధువుల ఇంట్లో ఉంచారు. దీంతో తీవ్ర వేదనకు గురైన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. ఆమె మృతికి బాలకిషన్ కారణమని ఆరోపిస్తూ మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. గీత మృతిచెందడంతో పాటు తనపై కేసు నమోదైన నేపథ్యంలో బాలకిషన్ పాలమాకులలో ఉంటున్న తన అక్క బాల్‌లక్ష్మి ఇంటికి వచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున  ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి అన్న రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement