తూర్పుగోదావరి జిల్లా బౌన్సర్స్ అసోసియేషన్ సమావేశాన్ని రాజమహేంద్రవరంలోని దానవాయిపేట వద్ద గల పవర్ ఫ్లెక్స్ గేమ్‌లో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ తగరం సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి అడ్డూరి వెంకట రమణ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తగరం సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా బౌన్స
బౌన్సర్స్ అసోసియేషన్ సమావేశం
Oct 1 2016 11:41 PM | Updated on Sep 4 2017 3:48 PM
తాడితోట (రాజమహేంద్రవరం) :
తూర్పుగోదావరి జిల్లా బౌన్సర్స్ అసోసియేషన్ సమావేశాన్ని రాజమహేంద్రవరంలోని దానవాయిపేట వద్ద గల పవర్ ఫ్లెక్స్ గేమ్‌లో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ తగరం సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి అడ్డూరి వెంకట రమణ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తగరం సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా బౌన్సర్లు ఉపాధి సంపాదించుకోవాలన్నారు. కార్యదర్శి పసుపులేటి సంతోష్ వందన సమర్పణ చేశారు. కోడూరి సునీల్, బొండు విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Advertisement


