మహిళపై బీరు.. బౌన్సర్ల రాక్షస దాడిలో యువకుడు మృతి! | Nightclub Driver Death Bouncers Assault over Spilled Beer | Sakshi
Sakshi News home page

మహిళపై బీరు.. బౌన్సర్ల రాక్షస దాడిలో యువకుడు మృతి!

Oct 13 2026 7:35 AM | Updated on Oct 13 2026 7:35 AM

Nightclub Driver Death Bouncers Assault over Spilled Beer

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా ప్రాంతంలో ఒక నైట్‌క్లబ్‌లో స్వల్ప వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. రఘువీర్ నగర్‌కు చెందిన 29 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ దల్జీత్ తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఆ నైట్‌క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న సమయంలో అతని స్నేహితుడి చేతిలోని బీర్ అనుకోకుండా ఒక మహిళపై పడటంతో మాటామాటా పెరిగి ఘర్షణ మొదలైంది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో క్లబ్ బౌన్సర్లు దల్జీత్, అతని స్నేహితులపై దాడికి దిగారు.

బాధితులు క్షమాపణలు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా, క్లబ్ వెయిటర్లు కూడా కలిసి వారిపై కర్రలు, గాజు సీసాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. క్లబ్ నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ, నిందితులు వారిని బలవంతంగా తిరిగి లోపలికి లాగి మరీ తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దల్జీత్‌ను అతని స్నేహితులు రఘువీర్ నగర్‌లోని ఇంటికి తీసుకురాగా, ఇంటి గేటు వద్దే అతడు కుప్పకూలిపోయాడు.

వెంటనే గురు గోవింద్ సింగ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు దల్జీత్‌కు భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు, తండ్రి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే క్లబ్‌లోని సీసీటీవీ డీవీఆర్‌ను స్వాధీనం చేసుకుని, మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. 

ఇదీ చదవండి: రాహుల్‌ పిటిషన్‌: 14 లోపాలతో ఎండగట్టిన సుప్రీంకోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement