టీడీపీ కార్యకర్త ఇంట్లో పేలిన బాంబులు | bomb blast in tdp follower house | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్త ఇంట్లో పేలిన బాంబులు

Apr 15 2016 9:26 AM | Updated on Aug 10 2018 9:42 PM

గుంటూరు జిల్లా నరసారావు పేట మండలంలో పమిడిపాడులో శుక్రవారం కలకలం రేగింది.

గుంటూరు: గుంటూరు జిల్లా నరసారావు పేట మండలంలో పమిడిపాడులో  శుక్రవారం కలకలం రేగింది. గ్రామానికి చెందిన టీడపీ కార్యకర్త ఎద్దు వెంకటేశ్వర్లు ఇంట్లో ఈ రోజు ఉదయం బాంబులు పేలాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పేలుడు పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబులు పేలుడు కు సంబందించి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement