ఇళ్ల మధ్య ఓపెన్ బ్లాస్టింగ్ తగదు
													 
										
					
					
					
																							
											
						 నివాస గృహాల మధ్య ఓపెన్ బ్లాస్టింగ్ చేయడం తగదని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు.
						 
										
					
					
																
	- పారుమంచాలలో దెబ్బతిన్న గృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే
	 - బాధితులకు   నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
	 
	 పారుమంచాల(జూపాడుబంగ్లా):  నివాస గృహాల మధ్య ఓపెన్ బ్లాస్టింగ్ చేయడం తగదని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు.  బ్లాసి్టంగ్తో  ఇళ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే  గ్రామానికెళ్లి  దెబ్బతిన్న గృహాలను  పరిశీలించారు. బాధిత ప్రజలతో మాటా్లడి  న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. పారుమంచాల వంతెన నిర్మాణంలో భాగంగా   పునాదులను కూలీలు, యంత్రాలతో చేయిస్తే ఖర్చు ఎక్కువవుతుందని,  బ్లాస్టింగ్ చేయిస్తే  సహించనన్నారు. ప్రజల అనుమతులు లేకుండా ఇలా చేయడం చట్టరీత్యనేరమన్నారు. బ్లాస్టింగ్‌తో ఇప్పటికే చాలా ఇళు్ల దెబ్బతిన్నాయని, వాటికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం  వంతెన నిర్మాణం పనులను పరిశీలించారు.  వంతెన పనులు దక్కించుకున్న కాంట్రాక్టరే, ఈ పనులు చేపట్టాలని, సబ్‌కాంట్రాక్టర్‌ను తొలగించాలన్నారు.  అలాగే   వంతెన నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.   కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ్‌కుమార్, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.