బీజేపీ బలోపేతమే లక్ష్యం | bjp will be strenghthened | Sakshi
Sakshi News home page

బీజేపీ బలోపేతమే లక్ష్యం

Aug 1 2016 12:21 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ బలోపేతమే లక్ష్యం - Sakshi

బీజేపీ బలోపేతమే లక్ష్యం

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు అన్నారు.

హన్మకొండ : తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం హన్మకొండ రాంనగర్‌లోని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈనెల 7న పార్టీ బూత్‌ కమిటీ సభ్యుల మహా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారన్నారు. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వస్తే, తెలంగాణకు 1948 సెప్టెంబర్‌ 17న వచ్చిందన్నారు. ఆ రోజును తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవాలన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే ప్రధాని మోదీకి సెప్టెంబర్‌ 17 ఆవశ్యకతను వివరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు, రావు పద్మ, కార్పొరేటర్‌ చాడా స్వాతి, నాయకులు వన్నాల శ్రీరాములు, డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, బన్న ప్రభాకర్‌ పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement