బీజేపీ తిరంగయాత్ర | BJP thiranga yatra | Sakshi
Sakshi News home page

బీజేపీ తిరంగయాత్ర

Sep 4 2016 9:40 PM | Updated on Mar 29 2019 5:32 PM

బూచినెల్లిలో బీజేపీ నాయకుల ర్యాలీ - Sakshi

బూచినెల్లిలో బీజేపీ నాయకుల ర్యాలీ

మండలంలోని బూచినెల్లి గ్రామంలో బీజేపీ నాయకులు తిరంగ యాత్ర నిర్వహించారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పండరి ఆధ్వర్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను పట్టుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

జహీరాబాద్‌ టౌన్‌: మండలంలోని బూచినెల్లి గ్రామంలో బీజేపీ నాయకులు తిరంగ యాత్ర నిర్వహించారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పండరి ఆధ్వర్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను పట్టుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని బసవేశ్వరుడు, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలే వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రం సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. 

17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ  పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా, జిల్లా మున్సిపల్‌ సెల్‌ కన్వీనర్‌ సుధీర్ బండారీ, నాయకులు విశ్వనాత్‌ యాదవ్‌, ప్రభాకర్‌రెడ్డి, అల్లాడి బక్కయ్య గుప్తా, వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement