పట్టిసీమ ప్రాజెక్టును ఎంత వేగంగా పూర్తి చేస్తున్నారో.... అంతే వేగంగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కె.హరిబాబు సూచించారు.
రాజమండ్రి : పట్టిసీమ ప్రాజెక్టును ఎంత వేగంగా పూర్తి చేస్తున్నారో.... అంతే వేగంగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కె.హరిబాబు సూచించారు. శనివారం పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన బీజేపీ ప్రజాప్రతినిధులతో కలసి పరిశీలించారు. అయితే పోలవరం పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం అండగా ఉంటుందన్నారు. కాంట్రాక్టర్ వల్లే పనుల్లో జాప్యం జరుగుతుందని హరిబాబు అభిప్రాయపడ్డారు. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్ను డిమాండ్ చేశారు. హరిబాబుతోపాటు బీజేపీ మంత్రులు పి మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పొలవరం ప్రాజెక్ట్ను పరిశీలించారు.