రాహుల్ను ప్రధాని చేసేందుకే సోనియా... | bjp leaders takes on congress party leaders | Sakshi
Sakshi News home page

రాహుల్ను ప్రధాని చేసేందుకే సోనియా...

Aug 6 2015 2:04 PM | Updated on Mar 28 2019 8:37 PM

ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపించారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపించారు. గురువారం విజయవాడలో బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ... రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే రాష్ట్రాన్ని సోనియా విభజించారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ను బీజేపీ ఆదుకుంటుందని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే నిధుల కంటే అధిక నిధులు రాష్ట్రానికి తీసుకొస్తామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన హామీలపై ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదని రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement