25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్‌ఐ | bheemili MRO caught red handed by ACB officers | Sakshi
Sakshi News home page

25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్‌ఐ

Jan 2 2017 7:58 PM | Updated on Aug 17 2018 12:56 PM

భీమిలి ఎమ్మార్వో ఆఫీసులో ఓ రైతు నుంచి రూ.25 వేలు తీసుకుంటూ ఆర్‌ఐ పట్టుబడ్డాడు.

భీమిలి: విశాఖ జిల్లా భీమిలి ఎమ్మార్వో ఆఫీసులో ఓ రైతు నుంచి రూ.25 వేలు తీసుకుంటూ ఆర్‌ఐ పట్టుబడ్డాడు. ఓ రైతు తన వ్యవసాయ భూమిని నివాస ప్రాంతంగా మార్చడానికి రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకున్నాడు. దీనిని నివాస ప్రాంతంగా మార్చాలంటే రూ.25 వేలు చెల్లించాలని ఆర్‌ఐ జి. శ్రీనివాసరావు సదరు రైతును డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని రైతు ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. రైతు నుంచి ఆర్‌ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement