గాయత్రీదేవిగా భద్రకాళీ అమ్మవారు | bhadrakali godess turn into gayathridevi | Sakshi
Sakshi News home page

గాయత్రీదేవిగా భద్రకాళీ అమ్మవారు

Oct 2 2016 6:00 PM | Updated on Sep 4 2017 3:55 PM

బొంతపల్లిలోని దుర్గామాత అమ్మవారు

బొంతపల్లిలోని దుర్గామాత అమ్మవారు

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బొంతపల్లిలోని భద్రకాళీ అమ్మవారు ఆదివారం గాయత్రీ దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు.

జిన్నారం: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బొంతపల్లిలోని భద్రకాళీ అమ్మవారు ఆదివారం గాయత్రీ దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉదయం నుంచి అర్చకులు  ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. అమ్మవారిని దర్మించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

బొంతపల్లిలోని దుర్గామాత సన్నిధిలో స్థానిక నాయకుల చక్రపాణి, శంకర్‌ల  ఆద్వర్యంలో  అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. జిన్నారంలోని దుర్గామాత సన్నిధిలో భక్తులు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారి కృపవల్ల ప్రజలు సంతోషంగా ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement