రామకృష్ణకు అమెరికా పురస్కారం | BEST PHOTOGRAPHER AWARD | Sakshi
Sakshi News home page

రామకృష్ణకు అమెరికా పురస్కారం

Sep 30 2016 10:53 PM | Updated on Sep 4 2017 3:39 PM

రామకృష్ణకు అమెరికా పురస్కారం

రామకృష్ణకు అమెరికా పురస్కారం

స్థానిక రోహిణి ఆర్‌కే స్టూడియో అధినేత కరక రామకృష్ణకు అమెరికాలోని ఇమేజ్‌ కొలీగ్‌ సొసై టీ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అకాడమీ ఆఫ్‌ ఫొటోగ్రఫీ తరఫున పాపికొండలు, అరకులో జరిగిన వర్కుషాపుల్లో రామకృష్ణ పాల్గొన్నారు. టేబుల్‌ టాప్‌ ఫొటోగ్రఫీపై 12 చిత్రాలతో కూడిన ఫొటో డాక్యుమెంటరీని ఈ ఏడాది మార్చిలో ఫొటోగ్రఫీ సొసైటీ అమెరికా, ఫెడరేషన్‌ డీలా ఆర్ట్‌ ఫొటోగ్రఫీ (ఫ్రాన్సు)లతో ప

జి.మేడపాడు(సామర్లకోట) : 
స్థానిక రోహిణి ఆర్‌కే స్టూడియో అధినేత కరక రామకృష్ణకు అమెరికాలోని ఇమేజ్‌ కొలీగ్‌ సొసై టీ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అకాడమీ ఆఫ్‌ ఫొటోగ్రఫీ తరఫున పాపికొండలు, అరకులో జరిగిన వర్కుషాపుల్లో రామకృష్ణ పాల్గొన్నారు.  టేబుల్‌ టాప్‌ ఫొటోగ్రఫీపై 12 చిత్రాలతో కూడిన ఫొటో డాక్యుమెంటరీని ఈ ఏడాది మార్చిలో ఫొటోగ్రఫీ సొసైటీ అమెరికా, ఫెడరేషన్‌ డీలా ఆర్ట్‌ ఫొటోగ్రఫీ (ఫ్రాన్సు)లతో పాటు ఇమేజ్‌ కొలీజ్‌ సొసైటీ (అమెరికా)కు అంతర్జాతీయ పోటీలకు పంపారు. రామకృష్ణ పంపిన  ఫొటోను తెలుపు–నలుపు విభాగంలో ఇమేజ్‌ కొలీజ్‌ సొసైటీ న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. ఆ సంస్థ చైర్మన్‌ టోనీ లీకిమ్‌ తాన్‌ ఈమెయిల్‌ ద్వారా రామకృష్ణను అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దాంతో పాటు సొసైటీలో జీవిత కాలం సభ్యతాన్ని కూడా పంపారని రామకృష్ణ శుక్రవారం విలేకర్లకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాసరెడ్డి తనను ప్రోత్సహిం చారని రామకృష్ణ తెలిపారు. తాను 17 ఏళ్లుగా ఫొటోగ్రఫీ వృత్తిలో ఉంటున్నట్టు వివరించారు. రామకృష్ణకు లభించిన అమెరికన్‌ గౌరవ పురస్కారాన్ని అసెంబ్లీ డిప్యూటీస్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌ ఇటీవల అందజేశారు. శుక్రవారం మోహన్‌ స్టూడియోలో రామకృష్ణను సామర్లకోట ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ గౌరవ అ««దl్య క్షుడు ఆర్‌.బాబ్జీ, అధ్యక్షుడు శంకరరావు, కార్యదర్శి శ్రీనివాసు, సభ్యులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement