పదవీ విరమణ రోజే బెనిఫిట్స్‌ | benefits on retirement day | Sakshi
Sakshi News home page

పదవీ విరమణ రోజే బెనిఫిట్స్‌

Jan 31 2017 11:58 PM | Updated on Sep 5 2017 2:34 AM

పదవీ విరమణ రోజే బెనిఫిట్స్‌

పదవీ విరమణ రోజే బెనిఫిట్స్‌

ఏలూరు అర్బన్‌ : ముఫ్పై ఏళ్ల సుదీర్ఘ కాలం ఒత్తిళ్లు, సవాళ్లతో విధులు నిర్వహించి అలిసిపోయారు ఇకపై ప్రశాంతంగా జీవించండి అని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ సూచించారు.

ఏలూరు అర్బన్‌ : ముఫ్పై ఏళ్ల సుదీర్ఘ కాలం ఒత్తిళ్లు, సవాళ్లతో విధులు నిర్వహించి అలిసిపోయారు ఇకపై ప్రశాంతంగా జీవించండి అని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ సూచించారు. నల్లజర్ల ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎ.ప్రకాశరావు పదవీ విరమణ చేయనున్న సందర్భంగా మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉద్యోగ విరమణ చెందిన వారికి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు ఆఖరిరోజునే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ప్రకాశరావుకు పూర్తి మొత్తం చెక్కు రూపంలో అందించామని చెప్పారు. అనంతరం ప్రకాశరావు దంపతులకు శాలువా కప్పి సత్కరించారు. ఎస్పీ వారిని పోలీసు బ్యాండు మేళంతో పోలీసు వాహనంలో సాగనంపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ అరిఫీ హఫీజ్, ఏఎస్పీ వలిశల రత్న, పోలీసు అధికారుల సంక్షేమ సంఘ నాయకులు కె.వెంకటరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement