బీరుసీసాల లారీ బోల్తా | beer bottles lorry turns turtle in nalgonda district | Sakshi
Sakshi News home page

బీరుసీసాల లారీ బోల్తా

Jan 29 2017 6:08 PM | Updated on Sep 5 2017 2:25 AM

నార్కట్‌పల్లి మండలం అమ్మనబోల్‌ గ్రామం వద్ద బీరు సీసాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది.

నార్కట్‌పల్లి(నల్గొండ జిల్లా): నార్కట్‌పల్లి మండలం అమ్మనబోల్‌ గ్రామం వద్ద బీరు సీసాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. డ్రైవర్‌, క్లీనర్‌లు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. కొన్ని బీరు సీసాలు మాత్రం పగిలిపోయాయి.

ఇదే అదునుగా కొందరు బీరుబాబులు తమ చేతికి పనిచెప్పారు. దొరికిన బీరుసీసాలను వెంట తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement