కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Karimnagar District: Car Hits Lorry | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Sep 18 2026 7:15 AM | Updated on Sep 18 2026 7:22 AM

Karimnagar District: Car Hits Lorry

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడికల్‌ శివారులో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ  ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిజామాబాద్‌కు చెందిన ట్రాన్స్‌కో ఉద్యోగులు వరంగల్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వేర్వేరు ఘటనల్లో..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నందిపహాడ్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అంబులెన్స్‌తో పాటు ఐదు కార్లను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి జియో బంక్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై కారును టిప్పర్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో బల్మూరు మండల్  కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధ్యాపా  అరుణ మృతి చెందారు. భర్త రాజేందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రాజేందర్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ‘నా చెల్లికి పట్టిన గతి ఎవరికీ రావొద్దు’..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement