సాక్షి, హైదరాబాద్: తండ్రి మందలించాడన్న కారణంతో కూతుళ్లు ఇంటిని వదిలి పారిపోయారు. ఈ సంఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి నివాసి సుభాష్ సింగ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఈనెల 14న ఆడపిల్లల పెళ్లి విషయమై ఇంట్లో చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సోదరుడు ఓ సోదరిపై చేయి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి పిల్లలను మందలించాడు. తండ్రి కూడా తమ మాట వినడం లేదని కుమార్తెలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఇద్దరూ ఈనెల 15న ఇంట్లోనుంచి వెళ్లిపోయారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో విచారించిన కుటుంబ సభ్యులు చివరకు హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


