నిఘా నిల్ ! | Bandar questionable safety in the district hospital | Sakshi
Sakshi News home page

నిఘా నిల్ !

Jul 17 2016 12:50 AM | Updated on Sep 4 2017 5:01 AM

నిఘా నిల్ !

నిఘా నిల్ !

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రితో....

బందరు జిల్లా ఆస్పత్రిలో భద్రత ప్రశ్నార్థకం
గుడివాడ, నూజివీడు ఏరియా ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి
ఎక్కడా కానరాని సీసీ కెమెరాలు
విజయవాడలో శిశువు  అదృశ్యంపై  సర్వత్రా ఆందోళన

 
మచిలీపట్నం టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు నూజివీడు, గుడివాడ ఏరియా ఆస్పత్రుల్లోనూ నిఘా కొరవడింది. ఈ క్రమంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తరచూ పిల్లల అపహరణ వార్తలు తల్లిదండ్రులను ఆందళోనకు గురిచేస్తున్నాయి. అయినా సీసీ కెమెరాల ఏర్పాటుపై అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆస్పత్రులు కిటకిట..
ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి, గుడివాడ, నూజివీడు ఏరియా ఆస్పత్రులు నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటాయి. ప్రసూతి విభాగాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో.. తెలుసుకునేందుకు ఆస్పత్రుల్లో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో ఐదు రోజుల శిశువు అపహరణకు గురైన విషయం తెలియడంతో ఇక్కడి ఆస్పత్రుల్లోని ప్రసూతి వార్డుల్లో ఉన్న బాలింతలు, వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. పగలు, రాత్రి శిశువుల వద్ద షిఫ్టుల వారీగా కాపలా ఉంటున్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అనుమానంగా చూస్తూ భయపడుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో 30మంది, సిజేరియన్ ప్రసూతి వార్డులో 30మంది బాలింతలు, శిశువులు ఉంటున్నారు. ఆయా వార్డులతోపాటు మరో 20 పడకలతో ఉన్న నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం (ఎస్‌సీఎన్‌ఎన్‌యూ) వద్ద కూడా భద్రత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement