‘పీఏ విషయంలో బాలకృష్ణదే తుదినిర్ణయం’ | balakrishna final desicion on his pa | Sakshi
Sakshi News home page

‘పీఏ విషయంలో బాలకృష్ణదే తుదినిర్ణయం’

Feb 7 2017 10:30 PM | Updated on Aug 29 2018 1:59 PM

పీఏ శేఖర్‌ విషయంలో తుదినిర్ణయం బాలకృష్ణదేనని, తాను స్వయంగా ప్రకటిస్తానని ఆయన తమకు ఫోన్‌ ద్వారా తెలియజేశారని బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ రంగనాయకులు చెప్పారు.

హిందూపురం అర్బన్‌/ చిలమత్తూరు/ లేపాక్షి : పీఏ శేఖర్‌ విషయంలో తుదినిర్ణయం బాలకృష్ణదేనని,  తాను స్వయంగా ప్రకటిస్తానని ఆయన తమకు ఫోన్‌ ద్వారా తెలియజేశారని బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ రంగనాయకులు చెప్పారు. మంగళవారం ఆయన పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. పీఏ శేఖర్‌ విషయంపై పార్టీ పెద్దలు, సీఎంతో తాను చర్చిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారన్నారు.ఏ విషయాన్నీ తానే స్వయంగా ప్రకటిస్తానని, అదే ఫైనల్‌ అని స్పష్టం చేశారన్నారు.
 
ముందస్తుగా పోలీసు బందోబస్తు
 హిందూపురం రూరల్‌ సీఐ రాజగోపాల్‌నాయుడు ఆధ్వర్యంలో  ఎస్‌ఐ శ్రీధర్, పోలీసులు మంగళవారం చిలమత్తూరు, కొడికొండ గ్రామాల్లో భారీ బందోబస్తు నిర్వహించారు. పీఏ శేఖర్‌ను తొలగించారని ప్రచారం జరగడంతో సోమవారం రాత్రి అసమ్మతి నాయకులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. మంగళవారం ఉదయం పట్టణంలో ర్యాలీలు నిర్వహించాలని అనుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. పీఏ శేఖర్‌ను తొలగించారన్న ప్రచారం సాగడంతో టీడీపీ నాయకులు లేపాక్షిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement