పాడుబడ్డ బావిలో పసికందు | baby dead body in a well | Sakshi
Sakshi News home page

పాడుబడ్డ బావిలో పసికందు

Jan 6 2016 11:06 AM | Updated on Oct 17 2018 3:53 PM

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పాడుబడ్డ బావిలో పడేశారు. కళ్లు తెరిచి లోకం చూడక ముందే ఆ చిన్నారి శాశ్వతంగా కన్నుమూసింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లోని జంగిలికొండలో జరిగింది. శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందును బయటకు తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement