నాలుగు కాళ్లతో శిశువు జననం | baby borns with 4 legs in prakasham district | Sakshi
Sakshi News home page

నాలుగు కాళ్లతో శిశువు జననం

Aug 10 2015 12:47 AM | Updated on Sep 3 2017 7:07 AM

నాలుగు కాళ్లతో శిశువు జననం

నాలుగు కాళ్లతో శిశువు జననం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాలుగు కాళ్ల మగశిశువు జన్మించాడు.

మార్కాపురం టౌన్: ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాలుగు కాళ్ల మగశిశువు జన్మించాడు. పట్టణానికి చెందిన శిరీషకు శనివారం స్థానిక చైత్ర నర్సింగ్ హోంలో కాన్పు చేశారు. ఆమెకు నాలుగు కాళ్లతో మలద్వారం మూసుకుపోయిన శిశువు జన్మించాడు. ఇది అరుదైనదని, 35 వేలమందిలో ఒకరికి ఇలా జరుగుతుందని చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ రవీంద్రారెడ్డి తెలిపారు. దీన్ని సాక్రోకాక్సిజియల్ కెరటోమ్ అంటారన్నారు. శస్త్రచికిత్స ద్వారా మలద్వారాన్ని పునరుద్ధరించవచ్చని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం శిశువును గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement