ఆయుర్వేద మందులు సీజ్‌ | ayurvedic medicine seaz | Sakshi
Sakshi News home page

ఆయుర్వేద మందులు సీజ్‌

Jul 2 2017 11:22 PM | Updated on Oct 9 2018 7:18 PM

తాడిపత్రి పట్టణంలోని కోదండరామస్వామి ఆలయంలో అక్రమంగా అమ్ముతున్న ‘వైద్యరుషి’ ఆయుర్వేద మందులను ఆదివారం ఔషధ తనిఖీ ఆధికారి కీర్తిపవిత్ర సీజ్‌ చేశారు.

తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రి పట్టణంలోని కోదండరామస్వామి ఆలయంలో అక్రమంగా అమ్ముతున్న ‘వైద్యరుషి’ ఆయుర్వేద మందులను ఆదివారం ఔషధ తనిఖీ ఆధికారి కీర్తిపవిత్ర సీజ్‌ చేశారు. పట్టణంలో వివిధ దేవాలయాలలో ప్రతి నెలా రెండో తేదీన కర్నూల్‌కు చెందిన వేణు, జనార్ధన్‌ అనే వ్యక్తులు ఆయుర్వేద మందులు అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. మందుల తయారీలో కల్తీ జరుగుతోందని, స్టెరాయిడ్స్‌ కలుపుతున్నారని  ఔషధ తనిఖీ ఆధికారి పేర్కొన్నారు. ఈ మందుల వాడకం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు అధికమవుతాయని అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement