ఆటో డ్రైవర్ల డిష్యుం.. డిష్యుం | auto driver Fight | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ల డిష్యుం.. డిష్యుం

Nov 26 2016 12:27 AM | Updated on Oct 2 2018 6:46 PM

పట్టణంలోని నేతాజీ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వచ్చిన రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఇద్దరు డ్రైవర్లూ ఆటో దిగి తప్పు నీదంటే నీదంటూ వాదులాడుకున్నారు. మాటలు తారస్థాయికి చేరుకున్నాయి. ఒకరికొకరు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు.

రాయదుర్గం అర్బన్: పట్టణంలోని నేతాజీ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వచ్చిన రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఇద్దరు డ్రైవర్లూ ఆటో దిగి తప్పు నీదంటే నీదంటూ వాదులాడుకున్నారు. మాటలు తారస్థాయికి చేరుకున్నాయి. ఒకరికొకరు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. నీ అంతు తేలుస్తా అని ఒకరు.. నీ కథ చూస్తానని మరొకరు ఆవేశంతో ఊగిపోయారు. ఆటోలను రోడ్డుపైనే ఉంచి గొడవ కొనసాగిస్తుండటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చివరకు స్థానికుల్లో కొందరు చొరవ తీసుకుని సర్దిచెప్పి వారిని అక్కడి నుంచి పంపేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement