వలసబాటలో మృత్యుఒడి | auto accident two died | Sakshi
Sakshi News home page

వలసబాటలో మృత్యుఒడి

Nov 3 2016 11:52 PM | Updated on Sep 4 2017 7:05 PM

పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిన రెండు కుటంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది.

 - వనపర్తి వద్ద ఆటో బోల్తా
- పెద్దమర్రివీడుకు చెందిన వ్యక్తి, చిన్నారి మృతి
 
గోనెగండ్ల: పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిన రెండు కుటంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. సొంతూరులో పనులు లేక పిల్లాపాలతో వలస వెళ్తుండగా చోటు చేసుకన్న ప్రమాదంలో ఓ వ్యక్తి, చిన్నారి మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పెద్దమరివీడు గ్రామం నుంచి బుధవారం సాయంత్రం 18 మంది మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తికి ఆటోలో వలస వెళ్లారు. మార్గమధ్యంలో కొత్తకోట సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన మాదన్న (45), అదే గ్రామానికి చెందిన రమాదేవి, నరసింహుడు దంపతుల కుమార్తె మమత(3) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడంతో అక్కడ పత్తి కోతలు ఉండటంతో కూలీ గిట్టుబాటు అవుతుందని వలస వెళ్తుండగా ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement