పాత నోట్లు.. రూ.350 కోట్లు | At the end of the deadline for the deposit banks | Sakshi
Sakshi News home page

పాత నోట్లు.. రూ.350 కోట్లు

Jan 4 2017 11:00 PM | Updated on Sep 22 2018 7:51 PM

కేంద్రప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి రెండు నెలలు కావస్తున్నా సాధారణ ప్రజల కష్టాల అంతు తేలడం

గడువు ముగిసే సమయానికి బ్యాంకుల్లో డిపాజిట్‌
ఒక్కో పట్టణంలో రూ.కోటికి పైగానే..
ఇంకా తెరుచుకోని   ఏటీఎంలతో ప్రజల ఇక్కట్లు
కానరాని రూ.100 నోట్లు.. రూ.500 నోట్లూ అక్కడక్కడే!


ఆత్మకూరు : కేంద్రప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి రెండు నెలలు కావస్తున్నా సాధారణ ప్రజల కష్టాల అంతు తేలడం లేదు. చెలామణి నిలిపివేసిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్, మార్పిడికి కేంద్రం అప్పట్లో అవకాశం కల్పించింది. కానీ నోట్ల మార్పిడిని రద్దు చేసిన ప్రభుత్వం బ్యాంకుల్లో ఖాతాదారులు మాత్రమే జమ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తన ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు డిసెంబర్‌ 30వ తేదీతో బ్యాంకుల్లో పాత నోట్లను జమ చేసుకునే గడువు ముగియగా.. అప్పటి వరకు   డిపాజిట్‌ అయిన మొత్తం వివరాలను బ్యాంకుల వారీగా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు.

ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల్లోనే..
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఎక్కువగా ఎస్‌బీహెచ్, ఆంద్రా బ్యాంకులోనే డిపాజిట్లు జరిగాయి. ఒక్క పరకాల పట్టణంలోని ఎస్‌బీహెచ్‌లోనే రూ.80కోట్ల 50లక్షలు డిపాజిట్‌ అయినట్లు అధికారులు తెలిపారు. ఇలా జిల్లా మొత్తం రూ.350 కోట్ల మేరకు పాత నోట్లను ఖాతాల్లో డిపాజిట్‌ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం.

17 బ్యాంకులు.. 64 శాఖలు
జిల్లాలో 17 బ్యాంకులకు సంబంధించి 64 శాఖలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 57 ఏటీఎంలు ఉండగా అందులో 45ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు. పనిచేస్తున్న వాటిల్లోనూ డబ్బు లోడ్‌ చేసిన గంట, రెండు గంటల్లో ఖాళీ అవుతున్నాయి. మంగళవారం కూడా అధికంగా ఏటీఎంలు మంగళవారం మ««ధ్యాహ్నం వరకే ఖాళీ అయ్యాయి. సంగెం ఆంధ్రాబ్యాంకులో ఏటీఎంలో రూ.4లక్షలకు పైగా లోడ్‌ చేసినా సాయంత్రం తర్వాత ఖాతాదారులకు డబ్బు లభించలేదు. ఇక జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఉన్న ఏటీఎంల్లో రూ.100 నోట్లు కరువయ్యాయి. పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో పనిచేసే పది, పదిహేను ఏటీఎంల్లో రూ.2వేల నోట్లే లోడ్‌ చేస్తున్నారు. ఇక నూతన రూ.500నోట్లు విడుదలైనా చాలా తక్కువగా ఖాతాదారులకు అందుతున్నాయి.

రుణాల విషయంలో కరువైన స్పష్టత
ఖాతాదారులు పాత నోట్లను జమ చేసే గడువు ముగిసి నాలుగు రోజులు దాటింది. అయినప్పటికీ రైతులు, వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఫసల్‌ భీమా యోజన దరఖాస్తుకు గడువు గత నెల 31తో ముగిసినా ఇంకా పది రోజులు పొడిగించారు. ఇక బ్యాంకర్లు రుణాల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అన్ని వర్గాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement