ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లోనే డిసెంబర్ 15 తర్వాత జరిగే అవకాశం ఉంది.
స్పీకర్ , సీఎం భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లోనే డిసెంబర్ 15 తర్వాత జరిగే అవకాశం ఉంది. రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో అక్కడే అసెంబ్లీ నిర్వహణకు ప్రభుత్వం తొలుత మొగ్గు చూపింది. తక్కువ సమయంలో తాత్కాలిక భవనాలు నిర్మించలేమని, ఖర్చు కూడా సుమారు రూ.12 కోట్లు అధికారులు నివేదించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ శివప్రసాదరావు సోమవారం సీఎంతో సమావేశమయ్యారు. చర్చించుకున్న అనంతరం అసెంబ్లీని హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలను గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఉన్న హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించే అవకాశం ఉంది.