breaking news
Speaker Prasad Rao
-
రెండు గదులు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: శాసససభ ఇన్నర్లాబీలో ఇప్పటికే కేటాయించిన కార్యాలయంతో పాటు, ఆవరణలోనే తమ కోసం విశాలంగా ఉండేలా రెండుగదుల కార్యాలయాన్ని ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీజేపీ శాసనసభాపక్షం (బీజేఎల్పి) విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ పక్షాన 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, నలుగురు ఎంపీలున్నందున సమావేశమయ్యేందుకు, సందర్శకులను కలుసుకునేందుకు వీలుగా రెండుగదులున్న కార్యాలయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం స్పీకర్‌కు బీజేఎల్పీ పక్షాన ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అందుబాటులో ఉన్న గదులు, వీలును బట్టి తప్పకుండా అసెంబ్లీ ఆవరణలోనే కార్యాలయం కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు. -
అసెంబ్లీ హైదరాబాద్‌లోనే
స్పీకర్ , సీఎం భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లోనే డిసెంబర్ 15 తర్వాత జరిగే అవకాశం ఉంది. రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో అక్కడే అసెంబ్లీ నిర్వహణకు ప్రభుత్వం తొలుత మొగ్గు చూపింది. తక్కువ సమయంలో తాత్కాలిక భవనాలు నిర్మించలేమని, ఖర్చు కూడా సుమారు రూ.12 కోట్లు అధికారులు నివేదించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ శివప్రసాదరావు సోమవారం సీఎంతో సమావేశమయ్యారు. చర్చించుకున్న అనంతరం అసెంబ్లీని హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలను గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఉన్న హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించే అవకాశం ఉంది.