ఓంక్యాప్‌ ద్వారా మస్కట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | applications accepted for maskat jobs | Sakshi
Sakshi News home page

ఓంక్యాప్‌ ద్వారా మస్కట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 28 2016 8:38 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఓంక్యాప్‌ ద్వారా మస్కట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం - Sakshi

ఓంక్యాప్‌ ద్వారా మస్కట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆం్ర«దప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఓంకాప్‌ ద్వారా మస్కట్‌లో అన్వర్‌ అల్మజెడ్‌ యునైటెడ్‌ (నేషనల్‌ ఎలక్ట్రిసిటీ సెంటర్‌)లో వివిధ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాశాఖాధికారి డాక్టర్‌ పి.వి.రమేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టెస్టింగ్‌ ఇంజినీరు–1, ఫోర్‌మెన్‌–3, లైన్‌మెన్‌–4, ఎలక్ట్రీషియన్‌–3, కేబుల్‌ జాయింటర్‌–1, డ్రాప్ట్స్‌మెన్‌–1, సర్వేయర్‌–1, హెచ్‌ఎస్‌ఈ ఆఫీసర్‌–1

విజయవాడ (మొగల్రాజపురం) :  
ఆం్ర«దప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఓంకాప్‌ ద్వారా మస్కట్‌లో అన్వర్‌ అల్మజెడ్‌ యునైటెడ్‌ (నేషనల్‌ ఎలక్ట్రిసిటీ సెంటర్‌)లో వివిధ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాశాఖాధికారి డాక్టర్‌ పి.వి.రమేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టెస్టింగ్‌ ఇంజినీరు–1, ఫోర్‌మెన్‌–3, లైన్‌మెన్‌–4, ఎలక్ట్రీషియన్‌–3, కేబుల్‌ జాయింటర్‌–1, డ్రాప్ట్స్‌మెన్‌–1, సర్వేయర్‌–1, హెచ్‌ఎస్‌ఈ ఆఫీసర్‌–1, బిల్‌ డిస్ట్రిబ్యూటర్లు–50 పోస్టుల భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. అక్టోబర్‌‡మూడో వారంలో ఇంటర్వూ్యలు జరుగుతాయని, ఇంటర్వూ్య జరిగే ప్రదేశం వివరాలను తర్వాత తెలియజేస్తామని వివరించారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తిబయోడేటా, పాస్‌పోర్టు, అర్హతలకు సంబంధించిన పత్రాలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో నగరంలోని ఐదో నంబరు బస్సు రూట్‌లో ఐటీఐ కళాశాల ఆవరణలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో అందించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 0866–2484948, 81792 04289, 70753 40904 నంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. బయోడేటాను నేరుగా సీవీవోఎంసీఏపీ ఎట్‌ దరెట్‌ఆఫ్‌ జిమెయిల్‌ డాట్‌ కామ్‌కు పంపవచ్చని  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement