ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అడిగితే, తమ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సభలో సమయం లేదనడం దారుణమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
'భూములివ్వని రైతులను ఇప్పటికీ వేధిస్తున్నారు'
Mar 9 2016 11:27 AM | Updated on Aug 18 2018 5:18 PM
హైదరాబాద్: ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అడిగితే, తమ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సభలో సమయం లేదనడం దారుణమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రుణమాఫీ అంశంపై ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద రామకృష్ణారెడ్డి మాట్లాడారు.
ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని రైతులను వరుసగా టార్గెట్ చేసిందన్నారు. రైతుల పంట పొలాలను తగులబెడుతున్నారని, అక్రమంగా దున్నెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ద్వారా నియంతల్లా వ్యవహిస్తున్నారని మండిపడ్డారు. భూములు ఇవ్వని రైతులను ఇప్పటికీ వేధిస్తున్నారన్నారు. రైతును రాజుగా చూడాలన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయంతో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement